Home » X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.

X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.

by Bunty
Ad

భద్రత అనేది చాలా ముఖ్యం. అయితే మన దేశంలో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జెడ్, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది. వీరిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాగే భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బిఎస్ ధనోవాలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. వివిఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులకు మాత్రమే దేశంలోనే అత్యున్నత స్థాయి జడ్ ప్లేస్ భద్రత ఉండేది.

READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!

Advertisement

జడ్ కేటగిరి భద్రత:

జడ్ కేటగిరి భద్రత దళంలో 22 మంది ఉంటారు. వీరిలో నలుగురు ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ కచ్చితంగా ఉంటారు. సెలబ్రిటీలకు, విఐపి లకు ఈ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తారు. గతంలో బాబా రామ్ దేవ్, అమీర్ ఖాన్ లకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారు. మెరుగైన బద్ధత కోసం ఎస్కార్ట్ కారు కూడా అందుబాటులో ఉంటుంది.

Advertisement

వైప్లస్ కేటగిరి భద్రత :
వై ప్లస్ కేటగిరీలో 11 మందితో కూడిన అధికారుల బృందం ఉంటుంది. ఇందులో ఇద్దరు నుంచి నలుగురు ఎన్ఎస్జి కమాండోలు, పోలీసు సిబ్బంది మొత్తం 11 మంది ఉంటారు.

READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

వై కేటగిరి భద్రత:
వై కేటగిరిలో 8 మంది భద్రతాధికారులు ఉంటారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఎన్ఎస్జి కమాండోలు ఉంటారు. మిగతా వారంతా పోలీసులు ఉంటారు.

ఎక్స్ కేటగిరి భద్రత:
ఎక్స్ కేటగిరి అనేది చివరికి కేటగిరి భద్రత. ఈ భద్రతను గౌరవప్రదమైన వ్యక్తులకు, సెలబ్రిటీలకు కల్పిస్తారు. ఇందులో ఇద్దరు భద్రతాధికారులు ఉంటారు. ఎన్ఎస్జి కమాండోలు ఉండరు. కేవలం అర్మ్డ్ పోలీసులు మాత్రమే భద్రత అధికారులుగా ఉంటారు.

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Visitors Are Also Reading