దసరా పండుగ ఉత్సవాలు తెలంగాణలో జరిపేవిధంగా ప్రపంచంలో మరెక్కడా కూాడా జరపరేమో అనిపిస్తుంది. ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సంప్రదాయం కేవలం తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. విజయదశమికి 10 రోజుల ముందు నుంచి తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వర్షాకాలంలో వస్తుంది. పరుచుకున్న పచ్చదనంలో హాయిగొలిపే పువ్వుల నవ్వుల్లో, జారే జలపాతపు సడిలో, పారే సెలయేటి హోయల్లో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందమైన ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందమైన ప్రకృతిని చూసిన వాళ్ల మనస్సు పరవశిస్తుంది. అలాంటి ఈ సమయంలో దొరికే రకరకాల పువ్వులను ఓ చోట పేర్చి మహిళలు అందరూ ఒకే చోట చేరి పాటలు పాడి నీటిలో నిమర్జనం చేస్తారు. అలా మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే పాటలు వినడానికి వినసొంపుగా చూడటానికి కనుల విందుగా ఉంటుంది. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతడి కుమారుడు సత్యస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ చోళా కుమారుడు రాజేంద్ర చోళ సత్యాస్రాయపై యుద్ధం చేసి విజయం సాధించాడు. అతను సాధించిన యుద్దానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ లింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీనికి కారణం తెలంగాణ ప్రజలు రాజేశ్వరి ఆలయంలోని అమ్మవారిని ఘాడంగా విశ్వసించేవారు. అయితే రాజేంద్ర చోళ తండ్రి అయినటువంటి రాజరాజచోళా కూడా అమ్మవారి భక్తుడిగా మారాడు. ఈ కారణం చేత యుద్ధంలో విజయం సాధించిన రాజేంద్ర చోళ ఆలయాన్ని కూల్చేసి అందులోని శివలింగాన్ని తన తండ్రికి బహుకరించాడు.
ఈ విషయం తమిళ శిలాశాసనాల్ని లిఖించబింది. అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తీసుకుపోవడంతో తెలంగాణ ప్రజల మనస్సు కలిచి వేసింది. దీంతో వాళ్లకు కలిగిన వర్ణణాతీత వేదనను చోళులకు తెలియజేస్తూ.. మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా బతుకమ్మ పండుగ మొదలైంది. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ప్రతీ ఏడాది ఆనవాయితీగా ఈ పండుగకు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వెంకటచైతన్య రెండో పెళ్లి… నిహారిక సంచలన నిర్ణయం ?