నవ్వు నాలుగు విధాలుగా చెడు అంటూ కొన్ని సందర్భాల్లో మన పెద్దలు పలుమార్లు చెబుతుంటారు. ఇక అదే నవ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిది అని మాత్రం వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మనలో సంతోషం ఎక్కువ అయినప్పుడు కూడా మనకు తెలియకుండా నవ్వు వస్తుంది. మనుషులకు అసలు నవ్వు ఎందుకు వస్తుంది..? అసలు దీని వెనుక దాగి ఉన్నటువంటి శాస్త్రీయ కారణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నవ్వు అనేది వయస్సు తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ వస్తుంది. సినిమాల్లోని కామెడీ సన్నివేశాలు చూసినప్పుడు కానీ.. మన స్నేహితులు ఏదైనా జోక్స్ చేసినప్పుడు, సంతోషం ఎక్కువైనప్పుడు వెంటనే మనకు నవ్వు వస్తుంది. అసలు విషయానికొస్తే.. మనం చేసే ఏ పనుల్లో అయినా మన మెదడు ఏది చెబితే అది చేస్తుంటాం. మనం చేసే ప్రతీ పనికి మెదడు కీలకం. మామూలుగా మన స్నేహితులు ఎవరైనా జోక్ చేసినా లేక సినిమాలలో ఏదైనా కామెడీ సన్నివేశాలు చూసినా వెంటనే మెదడులో ఉన్నటువంటి నాడీ ప్రేరేపితమవుతుంది. క్షణాల్లో మన పెదవుల ద్వారా నవ్వు విరబూస్తుంది.
Advertisement
Also Read : దిష్టి కోసం మీ పిల్లలకు నల్లదారం కడుతున్నారా..? ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి..!
అయితే మనం ప్రతీ రోజూ నవ్వే నవ్వు వెనుక శాస్త్రీయ కోణం ఉందట. మనిషిలో సహజంగా జరిగే ప్రక్రియ ద్వారా పలు లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. నవ్వడం ద్వారా ఒత్తిడి దూరమవ్వడమే కాకుండా రోగనిరోధక శక్తి మెరుగు పడుతుందనే నిపుణులు తెలిపారు. నవ్వడం వల్ల మొహంలోని అవయవాలన్ని కదులుతాయని.. దీంతో యవ్వనంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. పార్కులో ఉదయం వేళలో చాలా మంది ఒకచోట చేరి పెద్ద పెద్దగా నవ్వుతుంటారు. అలా అవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపడడంతో పాటు ఉత్తేజంగా ఉంటారట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇక నుంచి నవ్వుతూ సంతోషంగా ఉండండి.
Also Read : రాత్రి కడుపులో గ్యాస్ పెరుగుతోందా.. అసలు కారణం ఇదే..?