మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. గాడ్‌ఫాదర్ పై ప్రేక్షకులు అంచనాలు పెంచుకోవడానికి ప్రధాన కారణం ఆచార్య ఫ్లాప్ కావడమే అని చెప్పవచ్చు. ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్లో ఒక అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో చిరంజీవికి కచ్చితంగా హిట్ పడాల్సిన సమయం వచ్చేసింది. ఇక ఆ సమయంలోనే గాడ్‌ఫాదర్ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
Advertisement
వాస్తవానికి ఇది మలయాళంలో మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ మూవీ రిమేక్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఇది మలయాళం సినిమా రిమేక్ అయినప్పటికీ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేశారు. ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ సీన్స్ చాలా ఉన్నాయి. చిరంజీవి ఎంట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి ఎంట్రీ సీన్‌కి సూపర్ స్టార్ రజినీకాంత్‌కి సంబంధం ఉందట. అది ఏంటో తెలుసా..? రజినీకాంత్ కారును ఓ సారి సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆపేశారట. సేమ్ గాడ్‌ఫాదర్ సినిమాలో కూడా అలాంటి సీన్ ఉంటుంది.
Advertisement
Also Read : ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులకి ఎన్టీఆర్ ఇచ్చిన 5 సూపర్ హిట్ సినిమాలు ఇవేనా..?
ట్రాఫిక్‌లో ఒకరోజు రజినీకాంత్ కారు చిక్కుకుందట. ట్రాఫిక్ పోలీస్ వచ్చి సీఎం వెళ్తున్నారు అందుకే కారును ఇక్కడి నుంచి తీయవద్దని చెప్పాడట. ఎంత సమయం పడుతుందని రజినీకాంత్ అడిగారట. దీంతో అరగంట సేపు పడుతుంది సార్ అన్నాడట పోలీస్. అరగంట వరకు కారు వెళ్లడానికి ఆపడం ఎందుకు అనగానే సారీ సార్ ఆర్డర్స్ అని చెప్పాడట. దీంతో రజినీకాంత్ కారు దిగి బయటికి వచ్చి ఓ షాపు దగ్గరికీ వెళ్లి సిగరేట్ కొనుక్కొని వెలిగించారట. రజినీకాంత్ ను చూసి అందరూ అక్కడ చుట్టూ చేరారట. దీంతో అక్కడికీ సీఎం జయలలిత కాన్వాయి వచ్చిందట. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారట. ఇదే సీన్‌ని చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలో పెట్టారు. ఇలా రియల్ లైఫ్ లో జరిగిన సీన్లను సినిమాల్లో పెట్టడం సర్వసాధారణం.
Also Read : “గాడ్ ఫాదర్” లో చిరంజీవి తండ్రిగా నటించిన ఈ నటుడిని గుర్తుపట్టారా..? ఒకప్పటి స్టార్ హీరో..!