Home » విజయ్, సమంత సినిమాలకు ఖుషి అని పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా ? 

విజయ్, సమంత సినిమాలకు ఖుషి అని పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా ? 

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం ప్రమోషన్లలో చాలా బిజీగా గడుపుతోంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో పాటు సమంత నటిస్తున్న మరో మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. 

Also Read :  రంజాన్ మాసంలో పెరుగు, యాలకులు, పుదీనా తింటే ఆ రోజంతా దాహం వేయదా?

Advertisement

కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అసిస్టెంట్ దర్శకునిగా కెరీర్ ప్రారంభించి నిన్నుకోరి చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శివ. మరోసారి ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. ఖుషి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిందన్నారు. సమంత మయోసైటిస్ సమస్య నుంచి కోల్కోవడం కోసం నాలుగు నెలల షూటింగ్ వాయిదా వేశామని.. ఇటీవల కశ్మీర్ లో 30 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేస్తామన్నారు. 

Advertisement

Also Read :  ఇద్ద‌రిని తుపాకీతో కాల్చాడు, సైకో…అంటూ బాల‌య్య పై పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

 

హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మజిలీ సమయంలో సమంతతో కలిసి పని చేశాను. ఖుషి కథ రాయగానే నా మనసులోకి వచ్చిన తొలి ఆలోచన సమంతనే అని.. ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని అనిపించింది. అందుకే తనను ఎంపిక చేశాను. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన పాత్రకు జీవం పోశాడు. ఖుషి చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.ఖుషి సినిమాలో హాస్యం, భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటాయని.. గతంలో విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం లాగే ఫీల్ గుడ్ మూవీగా ఎంతో ప్రేక్షకాధారణ పొందింది. ఈ చిత్రం కూడా అంతే ఫీల్ ఉంటుందని.. అందుకే ఈ సినిమాకు ఖుషి అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెప్పారు దర్శుడు శివ. 

Also Read :  రామ్ చరణ్, ఉపాసన దంపతులపై మనోజ్ చేసిన ట్వీట్ వైరల్..!

Visitors Are Also Reading