Home » రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ?

రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాజేంద్ర ప్రసాద్ కి  ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది.  అయితే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వాస్తవానికి ఈయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో హిట్ గా నిలిచాయి. ఈయన చేసిన సినిమాలు అన్ని కూడా కామెడీ ప్రధానంగా నడిచేవి కావడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. సాధారణంగా హీరోలందరూ మాస్ సినిమాలు చేస్తుంటే.. రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఒక్కడే కామెడీ సినిమాలు ఎందుకు చేశాడనే డౌన్ మీకు రావచ్చు. ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ రాజేంద్ర ప్రసాద్ కి దగ్గరి బంధువు. అప్పుడప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఊరికి వస్తూ పోతూ ఉండేవాడట. అయితే ఓసారి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ని కలిసి నేను సినిమాల్లోకి వస్తాను అన్నయ్య.. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్పాడట. నువ్వు సినిమాల్లోకి వస్తావు బాగానే ఉంది. కానీ ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్లని కాదని ప్రేక్షకులు నిన్ను ఆదరించాలంటే నువ్వు కూడా వాళ్లలాగే చేస్తే కుదరదు. వాళ్లకి మించి వెరైటీగా ఏమైనా చేయాలి అప్పుడే నిన్ను ప్రేక్షకులు ఆదిరిస్తారని సలహా ఇచ్చాడట. రాజేంద్ర ప్రసాద్ బాగా ఆలోచించుకొని కామెడీ అయితే బాగుంటుంది అని కామెడీ సినిమాలు చేయడానికీ సిద్ధపడ్డారు.

ఇతనికి నటనపై  ఉన్న ఆసక్తిని గమనించి  చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడట ఎన్టీఆర్. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లోకి ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది.  ఇక అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలను తీస్తూ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కామెడీని పండిస్తూ.. నటకిరీటి అనే పేరు సంపాదించుకున్నాడు. అలా సీనియర్ ఎన్టీఆర్ వల్లనే రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. హీరోలకు తండ్రిగా, మామగా నటిస్తూ నవ్వులు పూయిస్తుండటం విశేషం. 

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading