Home » శుక్రవారం రోజునే మూవీస్ రిలీజ్ అవ్వడానికి కారణమేంటో తెలుసా..?

శుక్రవారం రోజునే మూవీస్ రిలీజ్ అవ్వడానికి కారణమేంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా ఏ సినిమా అయినా చాలా వరకు శుక్రవారం రోజున థియేటర్లలోకి వస్తోంది.. అయితే ఇప్పటివరకు చాలా మంది ఈ విషయాన్ని గమనించి ఉండరు.. శుక్రవారం రోజున సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తారు? దానికి కారణం ఏమిటి? అనేది మీరు ఒక్కసారైనా ఆలోచించారా.. మరి ఆరోజు ఎందుకు రిలీజ్ చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం.. అయితే చాలామంది వారం మొత్తం వర్క్ చేసి లాస్ట్ రెండు రోజుల్లో సెలవు దొరకడంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు..

Advertisement

ఈ క్రమంలోనే కొంతమంది శుక్రవారం వరకు డ్యూటీ చేసి చివరి శని, ఆదివారాల్లో సినిమాలు, షికార్లు ఇతర పనులు ఉంటే ముగించుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది టైం దొరికిందంటే చాలు తన కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి చిత్ర యూనిట్ కూడా కొత్త కొత్త సినిమాలను శుక్రవారం రోజున రిలీజ్ చేస్తుంది. ఇది చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఒక సెంటిమెంట్.కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కోక్కసారి మిగతా వారంలో కూడా సినిమా రిలీజ్ అవుతుంది.

Advertisement

అయితే 1950కి ముందు సినిమా అనేది శుక్రవారం రిలీజ్ అయ్యేది కాదట, మొదటిసారి శుక్రవారం మనదేశంలో విడుదలైన మూవీ మొగల్ ఏ అజమ్, ఇక అప్పటి నుంచి సినిమాలన్నీ శుక్రవారం రిలీజ్ అవుతూ వస్తున్నాయి. దీనికి తోడుగా పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు శుక్రవారం పూట సెలవులు ఉండటం కూడా ప్రధాన కారణం. అలాగే భారతదేశంలో శుక్రవారాన్ని లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి సినిమాను శుక్రవారం రోజున రిలీజ్ చేస్తే లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుందని భావిస్తూ శుక్రవారం రోజు మూవీ ని రిలీజ్ చేస్తారు.

ALSO READ;

Visitors Are Also Reading