Home » హీరోయిన్ నందిత శ్వేత అంత లావు కావడానికి కారణం ఏంటో తెలుసా ? 

హీరోయిన్ నందిత శ్వేత అంత లావు కావడానికి కారణం ఏంటో తెలుసా ? 

by Anji
Ad

హీరోయిన్ నందిత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ. అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళం భాషల్లో నటించింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథ చిత్రం 2, కపటదారి, అక్షర వంటి మూవీస్ లలో మెరిసింది ఈ బ్యూటీ. 

Advertisement

ఇక ఆ మధ్య బుల్లి తెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢీ 14 డ్యాన్స్ షోలో నందిత జడ్జీగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం నందితా శ్వేత త్వరలో హిడింబా అనే మూవీతో ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జులై 21న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నందిత.. అంతగా లావు కావడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చింది. తనకు ఉన్నటువంటి ఓ అనారోగ్య సమస్య కారణంగానే ఆమె అంతగా లావు అయిందట. ఫైబ్రోమయాల్జియా అనే కండర రుగ్మతతో బాధపడుతుందట. దీంతో చాలా ఎక్కువగా డైట్ పాటిస్తూ.. భారీ వ్యాయామాలు చేయడం కూడా సాధ్యం కాలేదట.

Advertisement

మితిమీరిన ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల ఇది ఇంకా తీవ్రతరం అవుతుందని.. ఆ కారణంగా ఇంకా బరువు పెరిగి పోతామంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత మళ్లీ ఒళ్లు తగ్గించడం సులభమైన పని కాదట. అలా అని వదిలేస్తే ఇంకా లావు అయిపోతామని చెప్పింది. ఇది వెన్నెముక, కండరాలకు సంబంధించిన సమస్యగా తెలిపింది నందిత. ఒక్కసారిగా నీరసం వచ్చేయడం.. ఆ నొప్పిని బ్రెయిన్ గ్రహించలేకపోవడం లాంటివి ఈ రుగ్మత లక్షణాలు అని.. క్రమం తప్పకుండా డైట్, వ్యాయామాలు చేస్తేనే మన ఆధీనంలో ఉంటుందని తెలిపింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టాలీవుడ్ హీరోలకు ఉన్న కార్లు..లిస్ట్ ఇదే

సుకుమార్, దిల్ రాజులకు షాక్ ఇచ్చిన శ్రీలీల !

Visitors Are Also Reading