టాలీవుడ్ హీరోగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు గోపిచంద్. తొలివలపు సినిమాతో మొదటిసారి హీరోగా కనిపించారు. ఇక ఆ తరువాత మధ్యలో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించి.. ఆ తరువాత మళ్లీ హీరోగా ప్రేక్షకులకు కనెక్ట్ అయి సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నాడు.
Advertisement
టి. కృష్ణ కుమారుడిగా మొదట సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తనదైన ముద్రతో దూసుకెళ్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు గోపిచంద్.తన తోటి హీరోలు పుల్ ఫ్యాన్స్ అంటూ అభిమాన సంఘాలు అంటూ గోల చేస్తున్న సైలెంట్ హీరోగా గోపిచంద్ తనదైన మార్కు చూపిస్తూనే ఉన్నాడు. 2022లో ఆరడుగుల బుల్లెట్, పక్క కమర్షియల్ వంటి రెండు సినిమాల్లో నటించినా అవి పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పవచ్చు. 2023లో శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 2001లో తొలివలపు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపుగా 21 ఏళ్లుగా సినీ పరిశ్రమలోనే ఉన్నారు. రెండు దశాబ్దాల్లో గోపిచంద్ తీసిన సినిమాలు కేవలం 20 మాత్రమే.
Advertisement
Also Read : పవన్ కళ్యాణ్ భార్యలపై జగన్ హాట్ కామెంట్స్
దాదాపు 21 ఏళ్ల సినీ కెరీర్ లో ఇంత తక్కువ సినిమాలు తీయడానికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ఆయన హీరో నుంచి విలన్ గా ఆ తరువాత.. మళ్లీ హీరోగా మారినప్పటికీ ఆయనలోని హీరో కంటే విలన్ ని జనాలు ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ కారణంతోనే ఆయన సోషల్ గా ఎక్కువగా మూవ్ కారనే అపోహ కూడా ఉంది. గోపిచంద్ విలన్ ఎందుకు అయ్యారో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను హీరోగా నటించిన తొలివలపు సినిమా ఫ్లాప్ అవ్వడంతో గోపించంద్ కి దాదాపు ఐదారు నెలల వరకు సినిమా అవకాశాలు రాలేదట. దీంతో తేజ, కృష్ణవంశీని వెళ్లి అడిగారట. వారు ఇచ్చిన సలహా మేరకు గోపించంద్ విలన్ గా నటించారట.
Also Read : బాలయ్యలో ఉన్న గొప్ప విషయాన్ని వెల్లడించిన సాయి మాదవ్ బుర్రా..!