గణపతి అంటే కేవలం గణాలకు మాత్రమే అధిపతి కాదు. ఘనమైన దైవం కూడా. ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలో అంతర్వామిగా ఉంటూ.. సృష్టిని శాసించే మహాశక్తిమంతుడు. అందుకే గణపతికి ఘనంగా పూజలు చేస్తుంటారు భక్తులు. పూజా సమయంలో పైన పాలవెల్లి కట్టి.. దాని కింద వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేస్తారు. ఈ అనంత విశ్వంలో భూమి అణువంత. ఆ భూమి మీద నిలబడి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తుంటాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని పిలుస్తాం. ఆ పాలవెల్లికి సంకేతంగా గణపతి పూజలో ఓ చతురస్రాన్ని కడతారు.
Advertisement
గణపతి పూజ అంటే ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి. అయితే పూజలో భూమిని సూచించేందుకు ప్రతిమను, జీవాన్ని సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆరాధిస్తుంటారు. గణపతి అంటే గణాలకే అధిపతి. తొలి పూజలు అందుకునే దేవుడు. ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అని అర్థం.
Advertisement
ఇది కూడా చదవండి : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఇవాళ ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!
ఇక పాలపుంతని సూచించే పాలవెల్లికి నక్షత్రాలకు గుర్తుగా పళ్లు కడతారు. వెలగపండు, మొక్కజొన్న పొత్తులు, జామ, దానిమ్మ వంటి పండ్లు కడుతుంటారు. ఏ దేవతకైనా షోడశోపచార పూజలో ఛత్రాన్ని సమర్పించడం ఒక ఆనవాయితీ. వినాయకుడు అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కాబట్టి స్వామికి ఛత్రంగా పాలవెల్లి ఉంటుంది. ఈ గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుడిని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, పత్రి లాంటి వస్తువులే ఇందులో ముఖ్యం. ఇక ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పాలవెల్లి కట్టి గరికతో పూజిస్తే చాలు. వినాయకచవితి పండుగ వైభవంగా జరిగినట్టే.
ఇది కూడా చదవండి : “అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే….?