Home » “అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే….?

“అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే….?

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించిన వాళ్లు ఆ తరవాత హీరో, హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాలపై ఆసక్తిలేని వాళ్ళు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిజానికి ప్రతి సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. అయితే అందరికీ గుర్తింపు వస్తుందని చెప్పలేం. కొందరు చేసింది రెండు సినిమాలే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండి పోతారు.

Advertisement

అలా గుర్తుండి పోయిన చైల్డ్ ఆర్టిస్ట్ లలో అమ్మోరు సినిమా చైల్డ్ ఆర్టిస్టు కూడా ఒకరు. అప్పట్లో అమ్మోరు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికీ సినిమా టివి లో వస్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఉన్నారు.

Advertisement

 

ఈ సినిమాలో ముఖ్యమైన అమ్మోరు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు పేరు సునైనా బాదం. చిన్న వయసులోనే ఛాలెంజింగ్ పాత్రలో నటించి సూనైన అభిమానులను సంపాదించుకుంది. పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ తన నటన తో ఆకట్టుకుంది. సినిమాలో ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక సునైన ప్రస్తుతం కూడా నటిగానే కొనసాగుతోంది. సమంత ఓ బేబీ సినిమాలో రాజేంద్రప్రసాద్ కు కూతురిగా నటించి మెప్పించింది. అంతే కాకుండా యుట్యూబ్ లో ఫ్రస్టేటెడ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయింది. ఇక ముందు ముందు సూనైనా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading