Home » ధనుష్ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా ?

ధనుష్ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈమె కన్న సిని పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నటువంటి ఈమె ధనుష్ హీరోగా నటిస్తున్న మూవీకి కూడా కమిట్ విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

ధనుష్ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో మాత్రమే కాకుండా టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ నటించిన సార్ మూవీ ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఒక్క సినిమాకు ప్రస్తుతం దాదాపు రూ.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Advertisement

అయితే కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్నటువంటి సినిమాలో మాత్రం రష్మిక నటించడం కోసం చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ధనుష్ సినిమా కోసం రష్మిక కేవలం రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఇలా చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో రష్మికకు పోటీగా ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటించడంతో ఈమెకు కాస్త అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే ఉన్న అవకాశాలు కోల్పోతాయనే ఉద్దేశంతోనే రష్మిక తక్కువ మొత్తంలో కూడా నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 టాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా టాప్-5 దర్శకులు వీరేనా ?

నాగ చైతన్య కి సమంత విడాకులు ఇవ్వడానికి కారణం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

Visitors Are Also Reading