తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలతో అక్కడ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. అలాగే తెలుగు ప్రేక్షకులను కూడా తన సినిమాలతో తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన నరసింహ సినిమాతో ఒక్కసారిగా అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
Advertisement
ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి క్యారెక్టర్ కోసం తొలుత ఒక తమిళ్ హీరోయిన్ ను అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఆమె స్థానంలో రమ్యకృష్ణ ను తీసుకున్నట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. నిజానికి రమ్యకృష్ణ ను తీసుకోమని మొదటగా రజనీకాంత్ చెప్పాడట. ఎందుకంటే ఆమెలో యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయని ఆ పాత్ర కి ఆమె బాగా సెట్ అవుతుందని డైరెక్టర్ కి చెప్పడట. దాంతో కే ఎస్ రవి కుమార్ రమ్యకృష్ణ ను పిలిచి ఆమెకి ఒక రోజు లుక్ టెస్ట్ చేశారట. నీలాంబరి క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని డైలాగ్ లు కూడా తనతో చెప్పించి, ఆ తరువాత ఆమెను ఆ క్యారెక్టర్ కు డైరెక్టర్ ఫిక్స్ చేశాడట. ఇక మొత్తానికైతే ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటించకుండా జీవించిందనే చెప్పాలి.
Advertisement
ఇప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం రమ్యకృష్ణ అనే చెప్పాలి. ఇక రజినీకాంత్ కోసం కూడా ఆ సినిమాను చూసే అభిమానులు ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే రమ్యకృష్ణ తన ఎంటైర్ కెరియర్ లో అలాంటి పాత్రను మళ్ళీ పోషించలేదనే చెప్పాలి. తను ఆ పాత్రలో రజనీకాంత్ లాంటి దిగ్గజ నటుడుని కూడా డామినేట్ చేసిందంటే ఆమె ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. ఇక ఆ పాత్ర తర్వాత ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమా లో ఆమె చేసిన శివగామి పాత్ర కూడా హైలైట్ గా నిలిచింది.
Also Read : చిరంజీవికి తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ చెప్పిన మాట ఏంటో తెలుసా ?