Home » కన్నడ సినిమాలకు డిమాండ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా ?

కన్నడ సినిమాలకు డిమాండ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji

కొన్నేళ్ల కిందటి వరకు కన్నడ సినిమాలు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయ్యేవి. కర్ణాటకలో కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలకే కలెక్షన్లు ఎక్కువగా వచ్చేవి. బడ్జెట్ పరిమితుల వల్ల కూడా కన్నడ దర్శక, నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో సినిమాలను చుట్టేసేవారు. కన్నడ సినిమాలు సక్సెస్ సాధించిన ఆ సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ కావడం చాలా అరుదుగా జరిగేది. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 సక్సెస్ ఈ లెక్కలను మార్చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1 కలెక్షన్ల విషయంలో భారీ స్థాయిలో సంచలనాలను సృష్టించకపోయినా ఇతర భాషల ప్రేక్షకులకు కన్నడ సినిమాలపై సదాభిప్రాయం కలగడానికి కారణం అయింది.

కేజీఎఫ్ చాప్టర్ 1 బడ్జెట్ తో పోల్చి చూస్తే నిర్మాతలకు మిగిలిన మొత్తం ఎక్కువేం కాదు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి రూ. 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత విక్రాంత్ రోణ , చార్లీ 777, కాంతార సినిమాలు కూడా సక్సెస్ సాధించి కన్నడ సినిమా రేంజ్ ను మరింత పెంచేశాయి. కాంతార సినిమా 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా 10 రెట్ల కలెక్షన్లను అందుకుంది.

Also Read :  ఎన్టీఆర్ తో సినిమా అంటే భయం వేసింది అంటున్న ప్రియదర్శి..!

వరుసగా కన్నడ సినిమాల సక్సెస్ తో కన్నడ సినిమాలకు మార్కెట్ డిమాండ్ అంతకంతకు పెరిగిపోతుంది. కొత్త తరహా కథాంశాలను ఎంచుకోవడం వల్ల నేటి యువతకు నచ్చేలా కథాంశాలు ఉండటం వల్ల కన్నడ సినిమాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. కన్నడ సినిమాల సక్సెస్ కు కొత్త తరహా కథలే కారణం కాగా.. శాండల్ వుడ్ ఇండస్ట్రీ వాహ ఎంతకాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది. కన్నడ దర్శక నిర్మాతలు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ టార్గెట్ గా సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు తీసుకురావాలని కన్నడ సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read :  మొద‌టి సారి యాడ్ లో న‌టించిన బాల‌య్య ఎంత తీసుకున్నారో తెలుసా..? ఆ డ‌బ్బు ఏం చేశారంటే..?

Visitors Are Also Reading