టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఇండస్ట్రీలో ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ హీరో కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. వంశీ మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్గా నమ్రత నటించిన విషయము విధితమే. ఈ సమయంలోనే మహేష్ బాబు నమ్రత ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత మహేష్ వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారట.
Advertisement
అయితే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తొలత వీరి ప్రేమను అస్సలు అంగీకరించలేదంట. దీనికి ఒక కారణం ఉంది. ఒక తెలుగు అమ్మాయితో సూపర్ స్టార్ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాడట. కానీ మహేష్ నమ్రతను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కృష్ణను ఒప్పించారట. వీరి లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహేష్ బాబు అక్క మంజుల వీరికి మంచి సపోర్టుగా నిలిచిందట. వీరి పెళ్లి జరగడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
Advertisement
అయితే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా 2005 ఫిబ్రవరి 10న మహేష్ బాబు-నమ్రత పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ సెల్రబిటీల జీవితాల్లో చాలా చిక్కులు, చికాకులుంటాయని అంటుంటారు. అలాంటి వాటికి ఈ జోడి ఎంతో దూరం అని నిరూపించింది. అంతేకాదు.. ఈ జంట ఒకరిపై ఉన్న ప్రేమని వ్యక్త పరుస్తూ ఉంటుంది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరూ పిల్లలున్న విషయం తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా మహేష్ బాబు కుటుంబంతో వీలు కుదిరినప్పుడల్లా కలిసి టూర్స్ లో ఎంజాయ్ చేస్తుంటారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
రావణుడి గురించి ఎవ్వరికీ తెలియని వాస్తవాలు ఇవే..!
కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్!