Home » అల్లు అర్జున్ భార్య పట్ల అలా వ్యవహరిస్తున్నాడా..? ఆ విషయంలో భార్య కోరిక తీర్చలేక..!

అల్లు అర్జున్ భార్య పట్ల అలా వ్యవహరిస్తున్నాడా..? ఆ విషయంలో భార్య కోరిక తీర్చలేక..!

by Anji
Ad

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైనటువంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలోనే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు బన్నీ. ఈయన స్నేహారెడ్డిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్న విషయం అందిరకీ తెలిసిందే. ఇటీవలే స్నేహారెడ్డి సొంత ఊర్లో  తన మామకి సంబంధించిన ఓ ఫంక్షన్ హాల్ ని కూడా ప్రారంభించాడు అల్లు అర్జున్. ఇక  మోస్ట్ బ్యూటిపుల్ క్యూటెస్ట్ కపుల్స్ పేరు సంపాదించుకున్న వారిలో అల్లుఅర్జున్-స్నేహారెడ్డి ఫస్ట్ రో లోనే ఉంటారు.

Advertisement

అల్లు అర్జున్ అంటే స్నేహారెడ్డికి.. స్నేహారెడ్డిరెడ్డి అంటే బన్నీకి చాలా ప్రేమ ఉంటుంది. తాజాగా  ఓ విషయం తెలిసిన చాలా మంది నెటజన్లు ఏంటి అల్లు అర్జున్ కి తన భార్యపై ప్రేమ లేదా.. ప్రేమించినట్టు నటిస్తాడా అంటూ కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఐకాన్ అల్లు అర్జున్ ప్రవర్తన పై నెటిజన్లకు ఎందుకు అనుమానం వచ్చింది. అల్లు అర్జున్-స్నేహారెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.  వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒకపాప, బాబు ఉన్నారు. ఈ మధ్య స్నేహరెడ్డి బర్త్ డే కి ఇద్దరూ పిల్లలను ఇంటి వద్దనే వదిలిపెట్టి లండన్ కి వెళ్లి మరీ స్నేహరెడ్డి బర్త్ డే ని సెలబ్రేట్ జరుపుకున్నారు ఈ క్యూట్ కపుల్స్. అన్ని అడిగినట్టుగానే చేసే అల్లు అర్జున్ మాత్రం స్నేహారెడ్డి విషయంలో ఆ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ నెరవేర్చడం లేదట. ఆ విషయం మరేదో కాదండోయ్.. స్నేహారెడ్డికి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేదట.

Advertisement

ఒక్కసారైనా తనను స్క్రీన్ పై చూసుకోవాలని ఆశ ఉండేదట. కానీ ఈ విషయంలో అందరిమాదిరిగానే బన్నీ కూడా ఆలోచించి నువ్వు సినిమాల్లోకి వస్తే అందరూ పెట్టిన నెగిటివ్ కామెంట్స్ మన కుటుంబం భరించలేదని చెప్పాడట. అలాగే అప్పుడప్పుడు ఫొటోలు దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే పర్వాలేదు. సినిమాలో నటిస్తానంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఇప్పటికే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా అంటే మరిన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని వింటూ కూర్చోవడం కంటే సైలెంట్ గా వేరే పని చేసుకోవడం బెటర్ అని.. అల్లు అర్జున్ స్నేహారెడ్డికి ఉన్న కోరికను ఆదిలోనే తుంచేశాడట. స్నేహరెడ్డి మాత్రం తన కోరిక నెరవేరలేదని బాధపడినట్టు సమాచారం. ఈ విషయంపై నెటిజన్లు అందరి లాంటి భర్తనే.. తన భార్యను ఎవరైనా ట్రోల్స్ చేస్తే తట్టుకోలేడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం  వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 చిరంజీవికి పేరు లేని సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ?

 బాలకృష్ణను మోసం చేసిన వెంకటేష్ .. ఇన్నాళ్లకు ఇప్పుడు వెలుగులోకి..!

Visitors Are Also Reading