ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే ముందు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. అందులో కొన్ని షాపింగ్ మాల్స్, హెల్త్ కు సంబంధించి యాడ్స్ వస్తూ ఉంటాయి. అందులో అప్పట్లో ప్రతి సినిమాకు ముందు ముఖేష్ స్టోరీని మనం చూశాం. అయితే తాను యాడ్ ని చేయడానికి గల కారణం ఏంటో ఎవరికీ తెలియదు. ముఖేష్ ది మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామం. అతనిది నిరుపేద కుటుంబం. ముఖేష్ రోజు కూలి పని చేస్తూ ఇంటిని పోషించేవాడు. తన సంపాదన మీదే కుటుంబమంతా ఆధారపడి ఉండేది. ఇలా ముఖేష్ కూలి పని చేసే క్రమంలో తన స్నేహితులతో కలిసి గుట్కా నమలడం అలవాటు చేసుకున్నాడు.
Advertisement
దీంతో ముఖేష్ తన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినప్పటికీ వినలేదు. చివరికి ఇతను ప్రాణాలను కోల్పోయాడు. అయితే ఈ యాడ్ చేయడానికి ముఖేష్ దగ్గరికి కొంతమంది వెళ్లి అతన్ని అడగ్గా అతను అప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేడు. చివరికి యాడ్ చేయడానికి ఒప్పుకొని అతి కష్టం మీద ముఖేష్ మాట్లాడుతూ… గుట్కా తినకూడదు అని నాకు నా కుటుంబ సభ్యులు చాలా చెప్పారు. మా అమ్మ కొన్ని సందర్భాల్లో నన్ను కొట్టింది కూడా.
Advertisement
అయినా నేను ఎవరి మాట వినలేదు. అని ముఖేష్ తన మాటల్లో చెప్పడం జరిగింది. అయితే తాను అలా చెప్పడం వల్ల కొంతమంది అయినా ప్రజలు మారతారనే నమ్మకంతో అతను ఈ యాడ్ చేయడానికి ఒప్పుకున్నాడట. అయితే 2009లో ముఖేష్ మరణించడం జరిగింది. 2011 నుంచి ముఖేష్ యాడ్ ని ప్రచారం చేయడానికి నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఏరాడికేషన్ సంస్థ పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ యాడ్ ని 2013 వరకు కొనసాగించారు. ఇలాంటి చెడు అలవాట్లకు ప్రజలు దూరంగా ఉండటం చాలా మంచిది.
ఇవి కూడా చదవండి
తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మీ కలలో ఇవి కనుక కనపడ్డాయి అంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది!
అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!