Home » విక్రమ్ సినిమాలో సంతానం గ్యాంగ్ మెంబర్ గా నటించిన మరగుజ్జు మనిషి రేంజ్ గురించి మీకు తెలుసా ? 

విక్రమ్ సినిమాలో సంతానం గ్యాంగ్ మెంబర్ గా నటించిన మరగుజ్జు మనిషి రేంజ్ గురించి మీకు తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

గత ఏడాది తమిళ విశ్వనటుడు ప్రధాన పాత్రలో నటించిన మూవీ విక్రమ్. ఈ సినిమా మనందరినీ ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో  కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ హీరోలు నటించారు. ఇంతమంది స్టార్ హీరో ల మధ్య అందరి దృష్టిని ఆకర్షించిన పాత్ర ఒకటి ఉంది. అదే సంతానం. గ్యాంగ్ లో ఓ మరగుజ్జు మెంబర్. తాజాగా ఇప్పుడు విడుదలైన జైలర్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఇతని మీదే. ఇంతకీ  ఈ నటుడు ఎవరు ? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ? ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

అతని పేరు జాఫర్ సాదిక్. ఈయన తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన వాడు.జులై 04, 1995న జన్మించాడు జాఫర్. ప్రస్తుతం తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న ఇతను కేవలం నటుడు మాత్రమే కాదు.. కొరియోగ్రఫార్, డ్యాన్సర్ కూడా.  జాఫర్ ఉంగలిల్ యార్ ప్రభుదేవా అనే తమిళ డ్యాన్స్ షో లో పాల్గొని రెండో స్థానంలో పొందాడు. ఆ షోతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇక ఆ తరువాత సొంతంగా ఓ డ్యాన్స్ స్టూడియోను స్థాపించాడు. దాని పేరు లిప్టదర్స్.. అంతే కాదండి.. ఈయన సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సు కూడా.

Advertisement

ఈయనకు ఇన్ స్టా గ్రామ్ 5లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జాఫర్ చాలా ఈవెంట్స్ లో స్టేజీ షోస్ కూడా చేశాడు. 2018లో ఆయన tedxgct ఈవెంట్ లో చేసిన పెర్పార్మన్స్ ఆయనను పాపులర్ చేసింది. ఇక ఆ తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఓ తమిళ సిరీస్ పావకధైగల్ నారికొట్టిగా నటించాడు. ఈ పాత్రతో సినీ పరిశ్రమలో  మంచి స్థానం సంపాదించాడు.ఇక ఆ తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీతో తొలిసారి వెండితెర మీద వెలిగాడు.  ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వస్తున్న జవాన్ మూవీలో కూడా నటిస్తున్నట్టు సమాచారం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో న‌టుడు….! ప్ర‌తి సినిమాలో ప‌క్కా ఉండాల్సిందేనా..?

మోజుపడ్డ తెలుగు హీరో… ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిన శ్రీ లీల ?

 

Visitors Are Also Reading