సౌత్ ఇండియా హీరోయిన్ నయనతార-విఘ్నేష్ శివన్ దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇప్పటివరకు సహజీవనం చేసిన వారు జూన్ 09న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం.. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నయనతార క్రిస్టియన్ అయినప్పటికీ హిందు సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నయన్-విఘ్నేష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా పెళ్లికి పెళ్లి కూతురు పసుపు రంగు చీర కట్టుకుంటుంది. కానీ నయన్ మాత్రం వెరైటీగా శారీ కట్టుకున్నది. విఘ్నేష్ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ఎరుపు రంగు చీరను పెళ్లి కూతురు ధరించాలట. అందుకే ఓ ప్రముఖ వింటర్‌తో ఎరుపు రంగు చీరను డిజైన్ చేయించుకున్నది నయనతార. ముఖ్యంగా ఈ చీర కోసం 15 మంది ప్రత్యేకంగా స్పెషల్ వర్క్ చేశారట. కేవలం చీర డిజైన్ కోసం దాదాపు రూ.25లక్షల వరకు ఖర్చు చేసిందట నయన్. ముంబైలో ఈ చీరను చేయించిందట. దీని ఫాబ్రిక్‌ను ప్రత్యేకంగా విదేశాల నుంచి తెప్పించారట. ఈ చీరలో నయన్ వాస్తవానికి కుందనపు బొమ్మలాగే కనిపించింది.
Advertisement
Advertisement
ఇక నయన్ ధరించిన జ్యూవెలరీ కూడా రూ.3కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీనిని విఘ్నేష్ తల్లిదండ్రులు తమ ఇంటి కోడలు నయన్‌కు ఇప్పించినట్టు తెలుస్తోంది. నయన్-విఘ్నేష్‌ల పెళ్లికి తమిళనాడులోని రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక బాలీవుడ్ నుంచి షారూఖ్‌ఖాన్ ప్రత్యేకంగా విచ్చేసి నయన్‌కు విషెష్ తెలిపారు. మరొక వైపు పెళ్లి తరువాత కూడా నయనతార సినిమాల్లో కొనసాగుతుందని.. ఈ విషయంలో భర్త విఘ్నేష్ కానీ, అతని తల్లిదండ్రులు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని నయన్ సన్నిహితులు పేర్కొంటున్నారు.
Also Read :
బాలయ్య రీమేక్ చేసిన సినిమాలేంటో మీకు తెలుసా..?
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత.. నెట్టింట్లో ఫోటో వైరల్..!