సాధారణంగా మనుషుల శరీరాలలో ఎప్పుడూ వింత మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రపంచ రికార్డులు, గిన్నిస్ రికార్డుల ద్వారా అలాంటివి ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత పొడవైన మనిషి నుంచి అతి తక్కువ ఎత్తు కలిగిన పొట్టి మనిషి వరకు రికార్డులు సృష్టిస్తుంటారు. అరుదైన వాటిని రికార్డుల్లోకి ఎక్కిస్తారనే విషయం తెలిసిందే.
Advertisement
చాలా మంది గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంటున్నారు. అయితే అత్యంత పొడవైన ముక్కు రికార్డు ఎవరిది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? చాలా వరకు ఆ ఆలోచన రాదు. కొద్ది మందిలో తప్ప ఎక్కువ మందికి ఆలోచన రాదు. అతి పొడవైన ముక్కు కలిగిన వ్యక్తి కూడా ఉన్నారండోయ్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగిన వ్యక్తి ప్రపంచ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు. అతనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ అతి ఇష్టంగా తినే ఆహారం ఏంటో తెలుసా ?
Advertisement
ఇంగ్లీషు సర్కస్ ప్రదర్శకుడి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా వరల్డ్ రికార్డు గుర్తించింది. వాస్తవానికి ఈ రికార్డు గతంలో 18వ శతాబ్దంలో నివసించిన వ్యక్తికి చెందింది. థామస్ వాడర్స్ అనే ఆంగ్ల సర్కస్ ప్రదర్శన కారుడు. అతను 19 సెం.మీ. అనగా 7.5 అంగుళాల పొడవు కలిగిన ముక్కును కలిగి ఉన్నాడు. చనిపోయిన తరువాత గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్తించబడ్డాడు. హిస్టారిస్ విడోస్ అనే ట్విట్టర్ పేజీ ఇటీవల ఒక ఫోటోతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన కథను పోస్ట్ చేసింది. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను కూడా ఏర్పాటు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డుల వెబ్ సైట్ ప్రకారం.. 1770లో ఇంగ్లండ్ లో నివసించే వాడు. అసాధారణ రూపంతో అతడు సర్కస్ లో సభ్యునిగా చేరాడు. థామస్ వెడ్డర్స్ 19 సెం.మీ. పొడవు కలిగిన ముక్కును కలిగి ఉన్నాడు. జీవించి ఉన్న వ్యక్తి పొడవైన ముక్కు రికార్డు మెహ్మెట్ ఓజురెక్ అనే టర్కిష్ వ్యక్తి పేరిట ఉంది. అతని ముక్కు పొడవు 8.80 సెం.మీ. ఉన్నదని.. నవంబర్ 13, 2021న ధృవీకరించబడింది. ప్రస్తుతం ఈ ముక్కుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు తనదైన శైలిలో కామెంట్స్ మొత్తానికి ఇప్పుడూ చర్చనీయాంశంగా మారింది.
Also Read : 2022లో మరిచిపోలేం.. సూపర్ స్టార్ ఫ్యామిలీలో ఒకే ఏడాదిలో ముగ్గురు మృతి..!