Home » నిజమైన “బింబిసారుని” చరిత్ర మీకు తెలుసా..?

నిజమైన “బింబిసారుని” చరిత్ర మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బింబిసారా సినిమా గురించి టాక్ నడుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. సోషియో ఫాంటసీ కథతో టైం ట్రావెల్ కాన్సెప్టు ను అప్లై చేస్తూ సినిమా తీశారని ట్రైలర్ చూశాక అందరికీ అర్థమైంది. వారి సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మరియు కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

 

ఈ మూవీ ఆగస్టు 5వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఎప్పుడూ లేనివిధంగా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ బింబి సార కథ చరిత్రలో కూడా ఉంది.. అసలు బింబిసారుడు అంటే ఎవరు.. అనే విషయాన్ని చాలామంది సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర భారతదేశంలో మగధ రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటి రాజు బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందినటువంటి బింబిసారుడు క్రీస్తుపూర్వం 558లో జన్మించారని చరిత్ర చెబుతోంది. ఈయన బట్టియ అని అధిపతి కుమారుడు.

Advertisement

పదిహేనేళ్ల వయసులోనే సింహాసనాన్ని చేపట్టిన బింబిసారుడు కొన్నాళ్ళకి తన స్థానాన్ని బలోపేతం చేయడం కోసం దేవిని వివాహం చేసుకున్నాడు. దేవి కోసల రాజైన మహా కొసల కూతురు. అయితే వివాహం కోసల మరియు మగధ రాజ్యాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని చెరిపివేసి ఇతర రాజ్యాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడింది. ఈ విధంగా బింబిసారుని కథ అంశంతో ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. దీన్ని సినిమాగా తీయడం అనేది అంత ఈజీ మ్యాటర్ ఏమి కాదు. ఈ మూవీని నాలుగు పార్ట్ లతో రూపొందించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ:

Visitors Are Also Reading