Home » హీరోల కొడుకులను బాబు అని పిలవడం వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?

హీరోల కొడుకులను బాబు అని పిలవడం వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఒక హీరోకు కుమారుడు ఉన్నట్టయితే టాలీవుడ్ లో కచ్చితంగా బాబు అని పిలుస్తుంటారు. అసలు ఈ బాబు అనే పదం ఎలా వచ్చింది..? దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

1940లో అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలలో నటించే వారిని ఆర్టిస్టులు అని పిలిచేవారని ఓ ఉదాహరణ గా చెప్పారు. ఆ సమయంలో తాను చిన్న హీరో కాబట్టి అప్పటి సీనియర్ దర్శకుడు ఒకరు అనరాని మాటలు మాట్లాడటం  బాగా అలవాటుగా మారిపోవడంతో అక్కినేని కూడా ఓ అనరాని మాటతో పిలుస్తూ ఉండేవారట. తన కన్న చాలా సీనియర్ కాబట్టి ఏమనలేకపోయారట అక్కినేని.  ఏమైనా అంటే ఉన్న కాస్త వేషం కూడా ఇవ్వరని ఆయన బాధ. నెల జీతం మీద పని చేసే అక్కినేని బాలరాజు సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత కూడా మళ్లీ మరో సినిమా చేయాలంటే నా దగ్గరకు రా అబ్బాయి అని ఆ దర్శకుడు పిలిచాడట.  

Also Read :   శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తారో మీకు తెలుసా..?

Advertisement

 

కానీ అక్కినేని ఆ ఒక్క మాటతో పిలవడం ఆపేస్తే తప్ప రాను అని చెప్పాశాడట. దీంతో భలేవాడివి రా వచ్చే. ఇంకా అలా పిలవను అని చెప్పారట. అదే సమయంలో భానుమతి గారికి అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఈ తరం వారు మర్యాద కోసం ఎన్నో పాట్లు పడ్డారు. పైగా ఆ సమయంలో ఆర్టిస్టులు అంటే ఒక చులకన భావం ఉండేదట.హెచ్.ఎం.రెడ్డి, కే.వీ.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు తరువాత ఎన్టీఆర్ అక్కినేని వంటి నటులు సీనియర్స్ గా చలామణి చేశారు. అప్పుడే కొత్తగా వచ్చే నటులకు సీరియర్స్ అయినా హీరోలకు గౌరవం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో సార్, బాబు, అయ్యా అనే పదాలు పుట్టుక వచ్చాయి. ఎన్టీఆర్ కొడుకు అయినా హరికృష్ణ ను Muద్దుగా బాబు అని, బాలకృష్ణ ను బాలయ్య అని సంబోధించడం ప్రారంభించారు. ఇక అక్కినేని కుమారులైన వెంకట్ ని పేదబాబుగా నాగార్జున ను చిన్నబాబు గా పిలిచేవారు. అలా హీరోల పిల్లలను ఫార్మాలిటీగా బాబు అని పిలవడం ప్రారంభమైంది. అదేబాబు అనే పేరు కృష్ణ కొడుకులకు రమేష్ బాబు మహేష్ బాబుగా తగిలించారు. మహేష్ బాబు వరకు వచ్చే సరికి బాబు అనే పదం పిచ్చిగా మారిపోయింది. 

Also Read :  ఆ నటుడితో చెల్లి,కూతురు, భార్యగా చేసిన రమ్యకృష్ణ.. ఆయన ఎవరంటే..?

Visitors Are Also Reading