Home » సుమన్ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న స్నేహితుడు ఎవరో తెలుసా ?

సుమన్ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న స్నేహితుడు ఎవరో తెలుసా ?

by Anji
Ad

ఏ పాత్రలోనైనా అలా ఒదిగిపోయే నటుడు సుమన్. ఆయన కరాటే ఫైటర్, డ్యాన్సర్, యాక్టర్. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే.. థియేటర్లలో జనాలా కోలాహలం విపరీతంగా ఉండేది. మాస్ పాత్రల్లో ఫైట్ చేయడంతో పాటు అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వర స్వామిగా అందరి  హృదయాల్లో నిలిచిపోయాడు. సుమన్ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

hero-suman-marriage

hero-suman-marriage

 

సుమన్  స్వస్థలం మంగులూరు. మాతృ భాష తుళు. సుమన్ తుళు, ఇంగ్లీషు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషలు స్పష్టంగా మాట్లాడగలడు. ఇవే కాకుండా వీణ, గిటారులను కూడా నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సుమన్ తొలుత కరాటే మాస్టర్ గా ప్రయాణాన్ని ప్రారంబించాడు.  సుమన్ ని కిట్టు తీసుకెళ్లి డైరెక్టర్ కె.రామన్నకి పరిచయం చేశాడు. సుమన్ ఈ విషయం విని ఆశ్చర్యపోయాడట. సుమన్ డైరెక్టర్ వద్దకు వెళ్లి తన కరాటే టాలెంట్ చూపించి మెప్పించారు. ఫస్ట్ రోజు షూటింగ్ లో సుమన్ చాలా ఇబ్బంది పడ్డాడట. కానీ దర్శకుడు ఆయనకి చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో సుమన్ ఆ షూటింగ్ వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాడు. మొదటి సినిమా విడుదల కాకముందే సుమన్ కి రెండు సినిమాలు చేసేందుకు అవకాశాలు వచ్చాయి. తమిళంలో నేచకులం అనే సినిమా 1979లో వచ్చి సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో సుమన్ ఫైట్స్ కి మంచి పేరు వచ్చింది. కేవలం మూడేళ్లలోనే తమిళంలో స్టార్ హీరోగా మారాడు సుమన్. 

Advertisement

సుమన్ సినిమాలు అన్ని చూసిన తరువాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగులో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఇద్దరు కిలాడీలు షూటింగ్ మొదలుపెట్టారు. కానీ సుమన్ నటించి విడుదలైన  తొలి చిత్రం తరంగిణి. అప్పట్లో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి జోరుగా డ్యాన్స్ తో దూసుకెళ్తున్నారు. సుమన్ ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించే వారు. వీరిద్దరూ పోటాపోటీగా సినిమాలు చేసేవారు. సినిమాల్లోనే కాదు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా సుమన్ కి చిరంజీవికి బాగా పోటీ ఉండేది. ప్రతీ పండుగకి సుమన్ కొత్త సినిమాలు థియేటర్స్ లో ఆడేవి. 1984 నుంచి దాదాపు సుమన్ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా బిజీగా ఉండేవారు. 1985లో తెలుగులో ఏకంగా 10 సినిమాల వరకు విడుదల చేశారు. 1985లో సుమన్ కి పెద్ద షాక్ తగిలింది. 1985 మే 18న సుమన్ ఇంటికి అర్థరాత్రి పోలీసులు వచ్చి మీ ఇంట్లో బాంబు పెట్టారని వెతకడం మొదలు పెట్టారు. ఆ చెకింగ్ మొత్తం అయిపోయిన తరువాత సుమన్ ని స్టేషన్ కి ఒకసారి రావాలని తీసుకెళ్లారు.

Suman

సుమన్ స్నేహితుడు దివాకర్ * ఫిలిం తీస్తున్నాడు. అందులో సుమన్ హస్తం ఉందని.. ఆయన కారుని కూడా ఆ ఫిలింలో వాడారని.. అందుకే సుమన్ ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. సుమన్ ని రౌడీలున్న సెల్ లో వేశారు. సుమన్ జైలుకు వెళ్లిన తరువాత విడుదలైన మొదటి చిత్రం కంచుకవచం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ పడిపోలేదని నిరూపించింది. ఈ సినిమా విజయం సాధించడంతో మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగ్ కోసం కోర్టులో అనుమతి తీసుకున్నారు. కానీ షూటింగ్ లన్ని చెన్నైలోనే జరగాలని కండీషన్ పెట్టారు. ఇక ఆ తరువాత సుమన్ కి మెల్లగా సినిమాలు రావడం తగ్గిపోయాయి. 1988లో వచ్చిన బంధిపోటు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్-ఏఎన్నార్ తరువాత సుమన్-భానుచందర్ మంచి జోడీగా రాణించారు. వీరిద్దరూ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు కావడం విశేషం. వీరిద్దరూ కలిసి 9 సినిమాలు చేయడం విశేషం. ఇందులో చాలా సినిమాలు హిట్ సాధించాయి. సుమన్ అన్నమయ్య, శ్రీరామదాస్ వంటి సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచి దేశవ్యాప్తంగా మన్ననలు పొందారు. సూపర్ స్టార్ రజినికాంత్-శంకర్ కాంబోలో వచ్చిన శివాజీ చిత్రంలో సుమన్ విలన్ గా కూడా నటించాడు. ప్రఖ్యాత తెలుగు రచయిత టి.వీ. నరసరాజు గారి మనవరాలు అయిన శిరీషను పెళ్లి చేసుకున్నారు. సుమన్ జైలు నుంచి వచ్చిన తరువాత సినిమా అవకాశాల రాకపోవడంతో పరువు, మర్యాదలు పోగొట్టుకున్నారు. అదేసమయంలో రచయిత తన మనవరాలుని ఇచ్చి పెళ్లి జరిపించడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. 

Advertisement

సుమన్ స్నేహితుడు దివాకర్ కి క్యాసెట్ రెంట్ కి ఇచ్చే ఒక షాపు ఉంది. ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. తన కారును కూడా సుమన్ దివాకర్ కి ఇస్తే.. దివాకర్ దానిని * ఫిలింలో వాడారట. ఇంత చిన్న విషయం అంతపెద్ద మ్యాటర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ విషయంతో సుమన్ కెరీర్ కి బ్రేక్ పడింది. ఆయన మీద అంతా నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. ఆ సమయంలో సుమన్ కి అభిమానులు, తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. సుమన్ ని ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేయడానికి ఆయన పోటీదారులు ఆయనను కేసులో ఇరికించారని ప్రచారం జరిగింది. అందులో చిరంజీవి పేరు కూడా వినిపించింది.  చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని సుమన్ ఖండించారు. సుమన్ ఇరుక్కున్నారో పోటీ దారుల కుట్రకు బలయ్యారో తెలియదు కానీ.. సుమన్ జైలుకు వెళ్లడంతో తరువాత కాలంలో ఆయన చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. 

Also Read :   హీరోయిన్ రాశిని అలా చేసి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..!!

Bhanu Chander is the reason who I am today, says veteran actor Suman | Telugu Movie News - Times of India

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. నా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నాపై కేసులు పెట్టారు. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటికి కారణం నా స్నేహితుడు. ఆ వ్యక్తి పేరు అప్పట్లోనే నేను తమిళ మీడియాకి చెప్పాను. ఆ వ్యక్తి పేరు రహస్యమేమి కాదు.. అతని పేరు దివాకర్. అతనికి సినిమాలతో సంబంధం లేదు. సినిమా వాళ్లతో కూడా సంబంధం లేదు. ఇది జరిగింది బయట కానీ సినిమాకి దానికి కనెక్షన్ పెట్టింది మాత్రం సినిమా వాళ్లు. అప్పట్లో కొంత మంది మీడియా వాళ్లు తప్పుడు రాతలు రాశారు. వాళ్లకు హైప్ రావాలని నిజాలు చెప్పకుండా స్వార్థానికి ఆలోచించుకున్నారు. దాని వల్ల నేను ఇబ్బందుల పాలయ్యాను. వాస్తవానికి ఆ ఇష్యూ ప్రైవేట్ ఫ్యామిలీ ఎఫైర్. నేను ఎలాగో జైైలుకు వెళ్తానని నాకు తెలుసు. నా జాతకం ప్రకారం ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు. మరీ ఇంత దారుణంగా అని అస్సలు అనుకోలేదు. నేను ఎలాగో ఇబ్బందులకు గురవుతున్నానని తెలిసి నా వల్ల నా స్నేహితుడు భానుచందర్ డిస్టబ్ అవ్వకూడదని అనుకున్నాను. ఎందుకంటే.. నన్ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చింది భాను చందర్. తమిళం కంటే తెలుగులోనే బాగా క్లిక్ అవుతామని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు అంత క్రేజీ వచ్చిందంటే కారణం భాను చందర్. ఆ సమయంలో నేను మిగిలిన వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను. అందుకే అతన్ని కలిసి భాను నువ్వు నన్ను కలవద్దు. నాకు ఫోన్ చేయవద్దు. మ్యాటర్ సీరియస్ గా ఉందని చెప్పాను. నేను జైలుకు వెళ్లడానికి స్టార్ కారణం అంటే నేను ఒప్పుకోను. జరిగిన మ్యాటర్ వేరు.. ప్రచారం వేరు” అని సుమన్ చెప్పుకొచ్చారు. సుమన్ రీల్ హీరోనే కాదు..  రియల్ హీరో అని కూడా అప్పట్లోనే  నిరూపించుకున్నాడు.  

Also Read :  కేజిఎఫ్ విలన్ కార్ డ్రైవర్ అని మీకు తెలుసా..?

Visitors Are Also Reading