Home » కేజిఎఫ్ విలన్ కార్ డ్రైవర్ అని మీకు తెలుసా..?

కేజిఎఫ్ విలన్ కార్ డ్రైవర్ అని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కే జి ఎఫ్ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ ద్వారా రాఖీ బాయ్ గా యష్ మంచి గుర్తింపు సాధించడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

ఈ మూవీలో హీరోకే కాకుండా చాలామంది పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హీరోకు ఎంత పేరు వచ్చిందో విలన్ కి కూడా అంతే పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇందులో రాఖీ పాత్రకు దీటుగా మెయిన్ విలన్ గా గరుడ పాత్ర చాలా ఫేమస్ అయింది.

ఇక ఈ చిత్రంలో గరుడ పాత్ర పోషించిన వ్యక్తికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. కే జి ఎఫ్ వన్ లో గరుడ పాత్ర పోషించిన వ్యక్తి రామ్ నిజానికి నటుడు కాదు. యష్ కు వ్యక్తిగత బాడీగార్డ్ మరియు కారు డ్రైవర్. ఈ విధంగా యష్ కు ఎంతో కాలం నుంచి సన్నిహితుడుగా ఉంటున్నారట. డైరెక్టర్ ప్రశాంత్ కథ గురించి హీరోతో చర్చించడానికి వెళ్ళినప్పుడు రాము ని చూశారట.

Advertisement

గరుడ పాత్రకు సరిపోతాడని భావించి ఆడిషన్స్ కు రావాలని చెప్పాడు. ఆడిషన్స్ లో సెలెక్ట్ కావడంతో గరుడ పాత్రకు తగ్గట్టుగా మారడం కోసం జిమ్ములో కసరత్తులు చేసి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని మెప్పించాడు. అతని డెడికేషన్ చూసిన ప్రశాంత్ నిల్ ఆ పాత్రలో రాముని ఫైనల్ చేశారని రామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విధంగా విలన్ పాత్రలో అదరగొట్టారు రామ్. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ నటుడుగా మారి బిజీ ఆర్టిస్ట్ గా మారారు.

also read:

Visitors Are Also Reading