మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు-పద్మజ దంపతుల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్-కిరణ్ త్రిపాఠిల కుమార్తె లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ తో పాటు తక్కువ మంది బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు గ్రాండ్ గా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో చివరి రోజు లావణ్య మెడలో మూడు ముళ్లు వేశారు వరుణ్ తేజ్.
Advertisement
ఇటలీలోని అత్యంత పురాతన గ్రామం అయిన టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. వీరిద్దరూ ఒకరినొకరూ మొదటిసారి ప్రేమను చెప్పుకున్న చోటే పెళ్లి చేసుకోవడం విశేషం. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లిలో వీరు ధరించిన పెళ్లి డ్రెస్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటికీ వచ్చింది. ఈ పెళ్లి డ్రెస్ కోసం లక్షల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. వీటి ధర సుమారు రూ.50లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ పెళ్లిలో అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి లైట్ గ్రీన్ కలర్ కుర్తాలో కనిపించగా. నాగబాబు క్రీమ్ కలర్ కుర్తా, పంచకట్టులో కనిపించారు.
Advertisement
అదేవిధంగా మెగా హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా కుర్తా పైజామా ధరించి పైనుంచి కోట్ ధరించారు. రామ్ చరణ్, పవన్ కళ్యాన్ మాత్రం చాలా సింపుల్ గా క్యాజువల్స్ దుస్తుల్లోనే కనిపించారు. నవంబర్ 01న పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కావడంతో హైదరాబాద్ లో 05న గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే వేడుక పలువురు సినీ ప్రముఖులు, పలురు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నట్టు సమాచారం.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!