దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా తీసినా సూపర్ హిట్ సాధించే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళి తీసినా సినిమా ఒక్కటి కూడా అట్టర్ ప్లాఫ్ గా నిలవలేదంటే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకున్నారు జక్కన్న. రాజమౌళి ఇటీవల తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
Advertisement
ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత జక్కన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాకపోతే రాజమౌళి తండ్రి కథ ఇలా ఉంటుందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. రాజమౌళి కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని వెల్లడించారు. మరోవైపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ చిత్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం రూ.15కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో జూన్ లేదా జులై నెలలో లాంచింగ్ ఉండనున్నట్టు తెలుస్తోంది.
Advertisement
ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. పక్కా ప్రణాలికతో కేవలం ఏడాది, ఏడాదిన్నరలోనే ఈ సినిమాను ముగించేయాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం కథను పూర్తి చేసే విషయంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారట. ఇండస్ట్రీలో ఇప్పటివరకు రూపొందని విధంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రందుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు.
Also Read : ప్రాణ స్నేహితుడిని నమ్మి.. దారుణంగా మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్!