Home » నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తింటే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తింటే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

దేశీ వైద్యంలో నెయ్యి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు..స్వచ్ఛమైన దేశీ నెయ్యితో బరువు తగ్గడం నుండి చర్మం, జుట్టు వరకు నెయ్యి చాలా విషయాలలో సహాయపడుతుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక పదార్థాలను కలిపి తీసుకోవటం వల్ల నెయ్యి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఒక కాంబినేషన్ నల్ల మిరియాలు, నెయ్యి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. నెయ్యి, నల్లమిరియాల మిశ్రమం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నెయ్యి, నల్ల మిరియాలు కలయిక జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదంలో ఈ అద్భుత మిశ్రమం కొన్ని ప్రయోజనాలను, దానిని వినియోగించే సరైన విధానాన్ని తెలుసుకుందాం.

Advertisement

నెయ్యి, నల్లమిరియాలు కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. ఇది మాత్రమే కాదు, దీని వినియోగం మీ రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. అందువల్ల, ఈ హోలిస్టిక్ రెమెడీ శరీరంలో మంటను తగ్గించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు చెప్పినట్లుగా, శరీరంలో దీర్ఘకాలిక మంట హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులకు దారి తీస్తుంది. నెయ్యి, నల్ల మిరియాలు కలయిక మంటను తగ్గిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, నెయ్యిలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. అదనంగా, ఇది ఆరోగ్యకరమైన నిద్రకు దోహదం చేస్తుంది.

Advertisement

 

నెయ్యి, నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల గుండె, కాలేయానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అవయవ నష్టం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ, మెదడు పనితీరులో సహాయపడుతుంది. నెయ్యి, నల్లమిరియాలు తినడం మెదడు ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. నెయ్యి, నల్లమిరియాలు తీసుకోవడం వల్ల మెదడు పదునుగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. నల్లమిరియాలు, నెయ్యితో కలిపి తీసుకోవటం వల్ల కంటి చూపును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. మన శరీరంలోని ప్రతిదీ మన ప్రేగులలో ప్రారంభమవుతుంది. నెయ్యి, నల్ల మిరియాల కాంబినేషన్‌ శరీరం నుండి విషాన్ని తొలగించడం ద్వారా ప్రేగులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ దేశీ నెయ్యి, 1/2 టీస్పూన్ నల్ల మిరియాల పొడిని మిక్స్‌ చేసుకోవాలి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తింటే  అద్భుతమైన ఫలితం ఉంటుంది.

Also Read :  అరటి ఆకు కషాయంతో ఎన్నో ఆకులకు దివ్యౌషదం..!

Visitors Are Also Reading