Home » పన్ను ఎగ్గొట్టడానికి సూర్యకాంతమ్మ వాడిన అద్భుతమైన టెక్నీక్ ఏంటో తెలుసా ?

పన్ను ఎగ్గొట్టడానికి సూర్యకాంతమ్మ వాడిన అద్భుతమైన టెక్నీక్ ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీ వాళ్లకు ఆదాయం విపరీతంగా ఉంటుందనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. పలువురు హీరోలు, హీరోయిన్లు రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటారో తెలిసిందే. వారికి వచ్చిన ఆదాయాన్ని బట్టే పన్నులను చెల్లిస్తుంటారు. ఇక అప్పట్లో అయితే పన్నులను సక్రమంగా చెల్లించే నటీనటులకు ప్రశంస పత్రాలతో పాటు అవార్డులను అందజేసేవారట. సినీ ఇండస్ట్రీ స్టార్స్ ని సన్మానించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందుండేది.

Suryakantham-Telugu-Actress

Advertisement

 

ముఖ్యంగా తొలుత సినిమా ఇండస్ట్రీ అంతా మద్రాస్ లోనే ఉండేది. దీంతో వారి ఆదాయపు పన్నులు కూడా ఆ రాష్ట్రానికే చెందేవి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హయాంలో కూడా అలాగే జరిగింది. ఆమె కూడా ఓ సినీ స్టార్ కావడంతో సినిమా వారిపై ఆమెకు ఎంతో గౌరవం ఉండేది. సినిమా వారికి సంబంధించిన ఆడిటింగ్ వ్యవహారాలన్నింటిని బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఎక్కువగా చూసుకునేది. నటి సూర్యకాంతమ్మకు సంబంధించిన లెక్కలు కూడా ఈ కంపెనీ చేతుల్లోనే ఉండేవి. సూర్యకాంతమ్మ కి మాత్రం ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించకపోయినా కూడా ప్రభుత్వ, అవార్డులు సన్మానాలు దక్కేవి. అదేంటి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా ప్రభుత్వం నుంచి సన్మానం ఎలా చేయించుకునే వారు అనే కదా మీ అనుమానం.. అక్కడే ఉంది అస్సలు విషయం.

మద్రాస్ లో సూర్యకాంతమ్మ భర్త న్యాయవాదిగా ఉండేవారు. ఆయనకు ఉన్న పేరు ప్రతిష్టలు పోకుండా ఉండాలంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని సూర్యకాంతమ్మ నిర్ణయించుకున్నారట. అందువల్ల ప్రతీ రూపాయి కూడా టాక్స్ పే చేయకుండా ఇలా దాన ధర్మాల రూపంలో ఖర్చు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. కానీ చేసింది సహాయమే కాబట్టి అప్పటి ప్రభుత్వాలు ఆమెను సత్కరించేవి. ఇలా ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించకుండా సూర్యకాంతమ్మ వారి సంపాదనను పేదల కోసం ఉపయోగించేవారు. అంతేకాదు.. ప్రభుత్వ సేవ నిధికి కూడా ఆమె చాలా డబ్బును విరాళంగా ఇచ్చేవారట.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading