రాష్ట్రపతి భవన్లో నిర్వహించబోయే జీ-20 సమ్మిట్ విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంతో ఇప్పడు అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దేశం పేరుని ఇండియా నుంచి భారత్‌గా మారుస్తున్నారా? అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు నిర్వహించనుండటంతో.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దేశం పేరుని ‘భారత్’గా మార్చే తీర్మానాన్ని తీసుకురావచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియా పేరుని మారుస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ కొన్ని దేశాలు మాత్రం రాజకీయ, సామాజిక లేదా ఇతర కారణాల వల్ల తమ పేర్లను మార్చుకున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
తుర్కియే :
2022లో టర్కీ దేశం పేరుని తుర్కియేగా మార్చుకుంటున్నట్టు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి తెలియజేసింది. తుర్కియే అనే పేరు తమ దేశ సంస్కృతి, నాగరికత విలువలను ప్రతిబింబజేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు.
నెదర్లాండ్ :
తమ గ్లోబల్ ఇమేజ్ ని నవినీకరించే లక్ష్యంతో హాలండ్ దేశం తన పేరును నెదర్లాండ్ గా మార్చుకుంది. ఈ పేరు మార్పుతో సరికొత్త ఆవిష్కరణలు, యూనిటికీ తమ దేశం ప్రాధాన్యత ఇస్తుందని ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని భావిస్తోంది.
మయన్మార్ :
బర్మా దేశం తన పేరును మయన్మార్ గా 1989లో మార్చుకుంది. బర్మన్ జాతికి చెందిన సమూహం ఆదిపత్యం చెలాయించడంతో ఈ దేశం చాలా కాలం పాటు బర్మాగా పిలవబడింది.
శ్రీలంక :
Advertisement
గతంలో సిలోన్ అని పిలువబడే ఈ ద్వీప దేశం దాని సాంస్కృతిక మూలాలను నొక్కి చెప్పడానికి అలాగే పోర్చుగీస్ బ్రిటిషు పాలన చారిత్రక అవశేషాలను తొలగించడానికి శ్రీలంకగా పేరు మార్చబడింది. సిలోన్ పేరు పేరు 2011 వరకు ప్రభుత్వ ఉపయోగంలో కొనసాగింది.
ఇరాన్ :
ప్రస్తుత ఆధునిక ఇరాన్ 1935 వరకు పర్షియా అని పిలువబడుతుంది. ప్రారంభానికి గుర్తుగా రాజు రెజా షా పర్షియా పేరును ఇరాన్ గా మార్చాడు. ఏది ఏమైనా ఆహారం, కళ, సాహిత్యం వంటి దీర్ఘకాల సాంస్కృతిక ఎగుమతులు పర్షియన్ గానే సూచించబడుతున్నాయి.
థాయిలాండ్ :
థాయిలాండ్ ను 1939లో సియామ్ గా పిలిచేవారు. ఇక ఆ తరువాత దేశపు స్వాతంత్య్రాన్ని నొక్కి చెప్పడానికి, థాయ్ ప్రజల జాతీయ గర్వాన్ని సూచించడానికి కొత్త పేరును ఎంపిక చేయబడింది.
చెకియా :
గతంలో చెక్ రిపబ్లిక్ గా పిలువబడిన ఈ దేశం 2016లో తన పేరును చెకియాగా మార్చుకుంది. పేరుతో సరళత కోసం, క్రీడా ఈవెంట్ తో పాటు మార్కెటింగ్ ప్రయత్నాల్లో తమ దేశం గుర్తింపుని సులభతరం చేసేందుకు చెకియాగా పేరు మార్చారు.
రిపబ్లిక్ ఆఫ్ కేబో వెర్డే :
కేఫ్ వేర్డే నుంచి రిపబ్లిక్ ఆఫ్ కేబో వెర్డే ఈ కేప్ వెర్డే దేశం 2013ో పూర్తి పోర్చుగీస్ స్పెల్లింగ్ ను స్వీకరించి.. రిపబ్లిక్ ఆప్ కేబో వెర్డేగా తన పేరును మార్చుకుంది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో :
1997 వరకు ఈ దేశం కాంగో ప్రీ స్టేట్, బెల్జియన్ కాంగో కాంగో లియోపోల్డ్ విల్లె, రిపబ్లిక్ ఆప్ కాంగో రిపబ్లిక్ ఆఫ్ జైర్ గా పిలవబడింది. చివరికీ 1997లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా తన పేరును ఫిక్స్ చేసుకుంది.
ఈశ్వతిని :
స్వాంజిలాంట్ నుంచి ఈశ్వతిని గా మారింది. గతంలో కింగ్ డమ్ ఆఫ్ స్వాజిలాండ్ గా పిలువబడేది. అయితే.. 2018లో కింగ్ ఎంస్వతి III ఈ దేశం పేరును ఈశ్వతిని మార్చారు.