తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో సావిత్రి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆమె తన అంద చందాలతో ఎలాంటి గుర్తింపును సాధించిందో ఆ విధంగానే సౌందర్య కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా గ్లామర్ పాత్రలకు కిలోమీటర్ల దూరంలో ఉంటూ సాంప్రదాయమైన పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోయిన్లలో సౌందర్య ఒకరని చెప్పవచ్చు. ఆమె అలనాటి హీరోలు ఆయన చిరంజీవి, వెంకటేష్, జగపతిబాబు వంటి హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది.
Advertisement
also read;Women IPL : మహిళల ఐపీఎల్..భారీ ధరకు మీడియా హక్కులు దక్కించుకున్న వైకొమ్ 18
Advertisement
ఈ విధంగా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్ గా మనందరికీ మాత్రమే తెలిసిన సౌందర్యలో మరో క్యారెక్టర్ ఉందని ఎవరికి తెలియదు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సౌందర్య ఎంత కూల్ గా కనిపిస్తారో అంత కోపం ఉంటుందట. ఆమెకు నచ్చని పనిచేసినప్పుడు ఎంత పెద్ద షూటింగ్ అయినా సరే మధ్యలో విడిచిపెట్టి ఇంటికి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయట.
ఆమె కోపం వస్తే ఎవరు ఏం చెప్పినా వినిపించుకునేది కాదట. మరి ముఖ్యంగా తనకు మాటలతో విసిగిస్తే మాత్రం ఇక ఆమె ముందు ఎవరు ఉంటే వారి పని కతమైనట్టే. ఎంతో ఓపిగ్గా సహనంతో ఉండే సౌందర్యకి కోపం వస్తే మాత్రం ఆపడం ఎవరి తరం కాదని సౌందర్య గురించి తెలిసిన కొంత మంది అభిమానులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఆమెలో ఇలాంటి కోణం కూడా ఉందని ఆశ్చర్యపోతున్నారు.
Advertisement
also read;