దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దర్శకుడు ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తన ఇమేజ్ ను పెంచుకుంటున్నాడు రాజమౌళి. టాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఆయన ప్రతిభ ఏంటో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1 తో రాజమౌళి దర్శకుడిగా మారాడు.
Advertisement
అంతకు ముందు ఈటీవీలో ప్రసారమైన శాంతినివాసం సీరియల్ కి దర్శకత్వం వహించారు. ఇక ఆ తరువాత స్టూడెంట్ నెం.1, సింహాద్రి, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, RRR వంటి చిత్రాలతో ప్రపంచ సినీ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు జక్కన్న. రాజమౌళి తన దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 13 సినిమాలను నిర్మించగా.. వాటిలో అన్ని మూవీస్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. కానీ ఒక్క సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయిందనే చెప్పాలి.
Advertisement
వాస్తవానికి ఆ సినిమా కొంచెం నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. 2004లో సెప్టెంబర్ 23న విడుదలైన సై, నితిన్ హీరోగా జెనిలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కథ పరంగా సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఆశించినస్థాయిలో లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. రూ.8కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.12కోట్లు సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఈ సినిమా హిట్టే కానీ.. కొన్ని ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన స్థాయిలో లాబాలను తెచ్చిపెట్టలేకపోయిందట. అయితే ఈ సినిమాలో రాజమౌళి కూడా ఓ పాత్రలో నటించింది. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కమెడియన్ బబ్లు గుర్తున్నాడా? ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?