యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్. మూవీతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు. దీంతో విదేశాల్లో సైతం అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. RRR మూవీలో కొమురం భీమ్ గా అద్భుతమైన నటన కనబరిచాడు ఎన్టీఆర్. ఆ నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశించారు. కానీ ఇండియా నుంచి RRR మూవీని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే విదేశాల ప్రేక్షకులు సైతం రిలీజ్ కోసం వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది.
Advertisement
ప్రస్తుతం ఎన్టీఆర్ నటించే దేవర మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు కొరటాల శివ అండ్ టీమ్. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో చాలా హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. అందులో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ఒకటి. ఎన్టీఆర్ కి ఫస్ట్ సక్సెస్ అందించింది ఈ చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. 2001 సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదలై 22 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఫస్ట్ షోతోనే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలన్నీ కూడా హిట్ అయ్యాయి.
Advertisement
అప్పట్లో ఈ చిత్రం 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు కొట్టింది. ఈ సినిమా అయితే పక్కనే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి డాడీ మూవీ మాత్రం నిలబడలేకపోయింది. తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 మూవీ దూసుకుపోవడంతో డాడీనీ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. అప్పట్లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు రాజమౌళికి తొలి చిత్రం కావడం విశేషం. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న రాజమౌళి.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క ఫెయిల్యూర్ మూవీ లేకుండా ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మహేష్ బాబు గురించి సుదీర్ బాబు మాటలు వింటే ఆశ్చర్య పోవడం పక్కా..!