సింగర్ సునిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె గుంటూరు పుట్టి పెరిగినప్పటికీ విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. తొలుత టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, అసిస్టెంట్ దర్శకురాలుగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో ఆమె చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. తొలుత ఆమెకు గులాబీ, ఎగిరే పావురమా మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తరువాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూనే చాలా మంది తెలుగు హీరోయిన్లకు వాయిస్ అందించింది. దాదాపు 500కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పని చేసింది సింగర్ సునిత.
Also Read : ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో తారకరత్న ఎన్టీఆర్ ను అవమానించాడా…? ఆ రోజు ఏం జరిగింది..?
Advertisement
సింగర్ సునిత జీవితం విషయానికి వస్తే 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాశ్, అమ్మాయి శ్రేయ. పిల్లలు పుట్టిన తరువాత కిరిణ్ కుమార్ చేసే వికృత చేష్టలకు విసిగిపోయి 2011లో విడాకులు తీసుకుంది. సునిత భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడని, ఆ కారణంతోనే తరుచూ వేధిస్తుండేవాడు. సింగర్ సునిత తన కెరీర్, పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కిరణ్ కుమార్ ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు. అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. విడాకుల తీసుకొని దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది.
Advertisement
Also Read : SR.Ntr గారి సినిమా నుంచి మధ్యలోనే ఎందుకు చిరుని తీసేసారు !
ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా పెద్దవారు అయ్యారు. కూతురు శ్రీయ చదువుకుంటూనే.. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో ఓ పాటను అద్భుతంగా పాడింది. అంతేకాదు మంచి మనసు ఉన్న మనిషిగా కూడా శ్రీయ పేరు తెచ్చుకుంది. వీరి కొడుకు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చదువులు చదువుతున్నాడు. పిల్లలిద్దరికీ తల్లి సునిత అంటే ఎంత ప్రేమో తండ్రి కిరణ్ అంటే కూడా అంతే ప్రేమ. ఇటీవలే సోషల్ మీడియాలో కిరణ్ కుమార్ ఫోటోలను చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఆయనను గుర్తు పట్టడం కూడా కష్టంగా మారింది. కిరణ్ కుమార్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లలో పని చేస్తూ.. అవార్డు ఫంక్షన్స్‌కి డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. సునిత పిల్లలు చిన్నప్పుడు తండ్రితో దిగన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : ప్రేమ కథ చిత్రం” హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?