Home » భారతదేశంలో సూర్యుడు తొలుత ఏ రాష్ట్రాంలో ఉదయిస్తాడో తెలుసా..?

భారతదేశంలో సూర్యుడు తొలుత ఏ రాష్ట్రాంలో ఉదయిస్తాడో తెలుసా..?

by Anji
Ad

ఈ  ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు  జరుగుతుంటాయి.  భూమి, సూర్యచంద్రుల కక్ష్యలన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరోవైపు ప్రజలు కూడా ఆ వింతలపై ఆసక్తి చూపిస్తుంటారు.  భూమి చుట్టుకొలత, ఆకాశం మరియు భూమి మధ్య దూరం.. సముద్ర మట్టం మరియు ఎత్తైన పర్వత శ్రేణులు వంటి అనేక భౌగోళిక అధ్యయనాల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. అంతాకాదు ఇలాంటి ప్రశ్నలు పరీక్షల్లో కూడా అడుగుతుంటారు.

Advertisement

ప్రస్తుతం అలాంటి ప్రశ్న ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు అనేది కొందరికి కలిగింది. అయితే దీనికి సమాధానం చాలామందికి తెలియదు. భారతదేశంలో మొదటి సూర్యోదయ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అంజావు జిల్లాలోని డాంగ్ అనే గ్రామంలో మొదట సూర్యుడు ఉదయిస్తాడు. ఈ పట్టణాన్ని జపాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.  డాంగ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజోలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో నది మరియు పర్వతాలతో చుట్టుముట్టబడిన గ్రామం. ఇది చైనా మరియు మయన్మార్ మధ్య ఉంది. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత్ సంగమం దీని శోభను పెంచుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ డాంగ్ గ్రామంలో సూర్యుడు గంట ముందుగానే ఉదయిస్తాడు. అలాగే సూర్యుడు గంట ముందుగా అస్తమిస్తాడు. అందుకే ఈ ప్రాంతం పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది.

Advertisement

Also Read :  ఆ ఊరి రైల్వే స్టేషన్ లో టికెట్లు కొంటారు.. కానీ ట్రైన్ ఎక్కరు.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading