వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగకు చాలాప్రాముఖ్యత ఉంది. వీధులలో పెద్దపెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకొని నిమజ్జనం వరకు ఎంతో వైభవంగా పూజలు చేస్తూ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే చాలామంది తమ ఇళ్లల్లో కూడా వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు కూడా చేస్తుంటారు. అయితే ఇంటికి తెచ్చుకునే వినాయకుడి తొండం కూడా ఎంతో ముఖ్యమైనదని పండితులు పేర్కొంటున్నారు. వినాయకుడి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వినాయకుడి తొండం సరైన దిశలో ఉండడానికి ఇది అవసరమని భావిస్తారు.
గణపతి పూజ కోసం ఆయన విగ్రహాన్ని కొన్నప్పుడు విగ్రహం ఎంత బాగుంది అని అందరూ చూస్తూ ఉంటారు. కానీ చాలామంది తొండం గురించి అంతగా పట్టించుకోరు. వాస్తు ప్రకారం.. గణపతి ఎంతో పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గణేశుడు శరీర భాగాలు జీవితంలోని విభిన్న విషయాలను తెలియజేస్తాయి. ఉదాహరణకు పెద్ద ఏనుగు తల తెలివితేటలు, జ్ఞానం, జీవితంలోని సమస్యలను ఎదుర్కొనే శక్తిని సూచిస్తుంది. గణపతి తొండం అన్ని ప్రాపంచిక సమస్యలను నిర్వహించడానికి అనుకూలత సామర్థ్యాన్ని సూచిస్తుంది. వినాయకుడి తొండం ఎప్పుడు తన తల్లి గౌరీదేవి వైపు ఉండాలి అంటే ఎడమవైపుకి ఉండాలని పండితులు చెబుతున్నారు. గణపతి తొండం దిశకు సంబంధించిన అనేక నమ్మకాలు ప్రజలలో ఉన్నాయి.
Advertisement
Advertisement
చంద్రుని దిశలో ఉన్నందున తొండం ఎడమవైపుకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఈ విగ్రహానికి శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెంది ఉంటుంది. ఈ కారణంగా వినాయకుడి విగ్రహం ఎడమవైపుకు ఉండడం వలన పూజకు శుభప్రదంగా భావిస్తారు. కుడి వైపుకు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాలు మరింత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. అందువలన తొండం కుడివైపుకు తిరిగి ఉన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతారు. కుడివైపు తొండం ఉన్న గణపతి చాలా మొండిగా ఉంటాడని చెబుతున్నారు. అతని పూజలో చిన్న దోషం ఉన్నా కూడా అంగీకరించరు. కాబట్టి అలాంటి విగ్రహాన్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. ఇక ఈ జాగ్రత్తలను పాటించండి. మనం న్యూస్ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కరివేపాకు మొక్క బాగా ఎదగట్లేదా..? ఈ టిప్స్ పాటిస్తే.. ఏపుగా పెరుగుతుంది..!
Ganesh Chaturthi 2023 : వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి…!