Home » నకిలీ రుద్రాక్షను గుర్తించడం ఎలాగో తెలుసా ?

నకిలీ రుద్రాక్షను గుర్తించడం ఎలాగో తెలుసా ?

by Anji
Ad

శివునికి ప్రతిరూపంగా రుద్రాక్షను చాలామంది ధరిస్తారు. రుద్రాక్షను ధరిస్తే పాజిటివ్ వైబ్స్ కలుగుతాయని, ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయని, మానసికంగా ప్రశాంతంగా ఉంటారని పండితులు అంటారు. సైన్స్ పరంగా చూసుకున్నా.. రుద్రాక్షను వేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే చాలామంది రుద్రాక్షను ధరించడానికి ఇష్టపడతారు. నకీలం కాలం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో దేనిని మనం నమ్మలేము.అన్ని కల్తీ, నకిలీవే ఉంటున్నాయి. మీరు తిరుమల వెళ్తే రుద్రాక్షలను చాలా సింపుల్ గా అమ్మేస్తుంటారు. నిజమైనది అని చెప్తారు. ఇంకా చాలా చోట్ల రుద్రాక్షలు విక్రయిస్తుంటారు. వాళ్ళు ఏవే జిమ్మిక్కులు చేసి ఇది నిజమైనదే అని మిమ్మల్ని మోసం కూడా చేస్తారు. అసలు నిజమైన రుద్రాక్షకు నకిలీ రుద్రాక్షకు తేడా ఏంటి, వాటిని ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రుద్రాక్షను రెండు రకాలుగా విభజించారు. స్వచ్ఛమైన లేదా నిజమైన రుద్రాక్షని ఇలియోకార్పస్ గానిట్రస్ గా పేర్కొన్నారు. నకిలీ లేదా భద్రాక్షని ఇలియోకార్పస్ లాకునోసస్ పేరుతో పిలుస్తారు. ఇవి కాకుండా ప్లాస్టిక్ రుద్రాక్షలను కూడా మనం మార్కెట్ లో చూడవచ్చు. ఈ కారణంగా, రుద్రాక్షను కొనుగోలు చేయడానికి ముందు అది అసలైనదా లేదా నకిలీదా అని సరిగ్గా తనిఖీ చేయాలి. నకిలీ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఆవాల నూనెలో కాసేపు రుద్రాక్షను ముంచడం ద్వారా అది అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. నిజమైన రుద్రాక్ష దాని రంగును కోల్పోదు. అదే నకిలీ రుద్రాక్షను ఆవనూనెలో వేసి కొంతసేపు ఉంచితే కచ్చితంగా రంగు పోతుంది.

Advertisement

దీనిని కనుగొనడానికి మరొక సులభమైన మార్గం. ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో రుద్రాక్షని ఉంచండి. నీటిలో మునిగితే అది నిజమైన రుద్రాక్ష. మరి నీటిపై తేలితే అది నిజమైన రుద్రాక్ష. రుద్రాక్ష పూస ఉపరితల రంద్రాల ద్వారా అసలైనదా, నకిలీదా గుర్తించవచ్చు. అసలైన రుద్రాక్షకు సహజ రంధ్రాలు ఉంటాయి. నకిలీ రుద్రాక్షకు రంధ్రాలు చేస్తారు.నిజమైన రుద్రాక్షను గుర్తించడానికి మరొక సులభమైన మార్గం ఏమిటంటే, పదునైన వస్తువును తీసుకొని రుద్రాక్ష పై గీయడం. అప్పుడు రుద్రాక్ష నుండి దారం బయటకు వస్తే అది నిజమైన రుద్రాక్ష. రెండు రాగి రేకుల మధ్య రుద్రాక్షను ఉంచితే వేగంగా తిరుగుతుంది. అదే నకిలీది అయితే ఎలాంటి చలనం ఉండదు. కాబట్టి ఈసారి రుద్రాక్షను తీసుకునే ముందు ఇలాంటి పరీక్షలు చేసి తీసుకోండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ పాలు ఇవ్వండి.. ఫలితం పక్కా..! 

 Health care : రాత్రి భోజనం తర్వాత నడవడం ఆరోగ్యానికి మంచిదా?

Visitors Are Also Reading