Home » Acharya : ధ‌ర్మ‌స్థ‌లి పేరును ఎలా సృష్టించారో తెలుసా..?

Acharya : ధ‌ర్మ‌స్థ‌లి పేరును ఎలా సృష్టించారో తెలుసా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో ధ‌ర్మస్థ‌లి చూసిన త‌రువాత చాలా మంది ధ‌ర్మ‌స్థ‌లి ఎక్క‌డ ఉంది..? అని దాని గురించి వెత‌క‌డం ప్రారంభిస్తారు అని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ పేర్కొన్నారు. ఆచార్య ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా ఈ చిత్రంలో కీల‌క‌మ‌ని చెప్పుకునే ధ‌ర్మస్థ‌లి ఎపిసోడ్‌పై కొర‌టాల స్పందించారు.


ముఖ్యంగా ధ‌ర్మ‌స్థ‌లిని ఎలా క్రియేట్ చేశారో వెల్ల‌డించారు. పురాత‌న గాథ‌లు, ఎన్నో న‌మ్మ‌కాలు క‌లిగిన అమ్మ‌వారి దేవాల‌యం ఉన్న ప్రాంతం అది. దాని పేరు ధ‌ర్మ‌స్థ‌లి. ఈ క‌థ ఎక్కువ‌గా ధ‌ర్మం అనే కాన్సెప్ట్ చుట్టే ఉంటుంద‌ని.. ఆ టెంపుల్ టౌన్ కు ధ‌ర్మ‌స్థ‌లి అనే పేరు పెడితే బాగుంటుంద‌ని అనుకున్నాం. మా అంద‌రికీ ఆ పేరు బాగా న‌చ్చింది. ద‌ర్మస్థ‌లి ఎపిసోడ్ షూటింగ్ సాధ్యం కాదు ఏమో అనిపించింది. అలా చివ‌రికీ మేము ధ‌ర్మ‌స్థ‌లి సృష్టించాల‌నే నిశ్చ‌యించుకున్నాం. అందుకు నిర్మాత‌లు ఓకే అన‌డంతో.. మా ఆర్ట్ డైరెక్ట‌ర్ సురేశ్ ఎన్నో ప్రాంతాల‌కు వెళ్లి.. ప‌రిశోద‌న చేసారు.

Advertisement

Advertisement

సెట్‌ని నిర్మించిన‌ స‌మ‌యంలో మేము పూజ‌లు నిర్వ‌హించాం. దేవాల‌యాల ప‌విత్ర‌త ఎక్క‌డ కూడా దెబ్బ‌తిన‌కుండా తీర్చిదిద్దాం. సినిమా చూసిన‌ప్పుడు ధ‌ర్మ‌స్థలి ఎక్క‌డ ఉంది..? అక్క‌డికి వెళ్దామ‌నే ఆలోచ‌న ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తుంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అది ఒక అంద‌మైన ప్ర‌దేశం. 20 ఎక‌రాల్లో కోట్లు వెచ్చించి నిర్మించిన బిగ్గెస్ట్ సెట్ అని కొర‌టాల వెల్ల‌డించారు. ఇక ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. పూజాహెగ్దే క‌థానాయిక‌. ప్ర‌స్తుతం ఆచార్య టీమ్ ప్ర‌మోష‌న్‌లో పుల్ బిజీగా ఉంటుంది.

Also Read : 

Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌.. ఏమ‌న్నారంటే..?

ఛాయ్ కోసం ట్రైన్ ఆపేసిన డ్రైవ‌ర్‌.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ప్ర‌యాణికులు..!

 

Visitors Are Also Reading