Home » “శంకర్ దాదా జిందాబాద్” మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

“శంకర్ దాదా జిందాబాద్” మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి, యాక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన చిత్రం “శంకర్ దాదా జిందాబాద్”. ఈ సినిమా బాలీవుడ్ లో “లగే రహో మున్నాభాయ్” సినిమాకి రీమేక్. కరిష్మా కోట ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో ఇక ఈ అమ్మడికి తెలుగులో సినిమా అవకాశాలు రాలేదు. అందం ఉన్నప్పటికి ఈ అమ్మడుని టాలీవుడ్ ఇండస్ట్రీ ఆదరించలేకపోయింది.

Advertisement

కరిష్మా బ్రిటిష్ మోడల్. యూకే, ఇండియాలో మోడల్ గా కొన్ని యాడ్స్ లలో కూడా నటించింది. కానీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుకు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా వెళ్ళింది.

ఇక తాను సినిమాల్లో పెద్దగా రాణించలేక లండన్ కి వెళ్లి ఇస్తే అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం కరిష్మా హీరోయిన్ కి మించిన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా నటించిన సమయంలో కన్నా ఇప్పుడు మరింత అందంగా యంగ్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుందట. ఒకప్పటికన్నా ఇప్పుడు మరింత అందంగా ఉంది. కనుక సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading