కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దేవాలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో శ్రీ విమోచనందన స్వామి హిమాలయాలలో బద్రినాథ్ ఆలయంలో ఉన్నారు. ఆలయం ధ్వంసం అయిందనే వార్త విన్న తరువాత విమోచనందన స్వామి ఇలా అన్నారు. శబరిమలలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ భారతదేశం అంతటా అయ్యప్ప స్వామి ఆలయాలను నిర్మించి.. త్వరలో ప్రపంచం అంతటా అయ్యప్ప స్వామి కీర్తించేవిధంగా చేస్తానని శత్రువులకు సవాల్ విసిరాడు. ఆయన పేర్కొన్నట్టుగానే కాశీ, హరిద్వార్, పూణె, ముంబై, కరపత్తూర్, శ్రీరంగపట్టణం తదితర ప్రాంతాల్లో అయ్యప్ప దేవాలయాలను నిర్మించారు. ప్రస్తుతం శబరిమల యాత్రకు కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు.
Advertisement
శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య గరిష్టంగా పెరగడంతో 1980 నుంచి దేవస్థానం బోర్డు వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంబాపై వంతెన, పంబా నుంచి విద్యుత్ దీపాలు, మంచినీరు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద పెద్ద షెడ్లను నిర్మించారు. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురాముడు నిర్మించిన రాతిమెట్లు ఉండేవి. అయితే అప్పట్లో ఆ మెట్లపైనే కొబ్బరికాయలు కొట్టేవారు. దీంతో ఆ మెట్లు అరిగిపోయి భక్తులకు ఎక్కడానికి చాలా ఇబ్బందిగా మారింది. దీంతో 1985లో భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి పంచలోహ కవచాలు మంత్ర, తంత్రాలతో కప్పారు. దీని వల్ల పదునెట్టాంబడిని ఎక్కడానికి చాలా సులభతరమైంది.
Advertisement
ఏటేటా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం వల్ల తొక్కిసలాటలు జరుగకుండా 1982లో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి దాని నుంచి వెళ్లే విధంగా ఏర్పాటు చేసారు. అదేవిధంగా కొండపై నుంచి మాలికాపత్తూర్ దేవిగుడి వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించడం వల్ల భక్తులకు తిరగడనికి చాలా వీలుగా ఉంది. అదేవిధంగా 1990లో పంబా, శబరిమల ఆలయ పరిధిలోని భాాగాన్ని సిమెంట్ తో కప్పేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకునేవిధంగా తయారు చేసారు. ఇలా చేయడం వల్ల వేలాది మంది భక్తులు మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఓ బెంగళూరు భక్తుడు అయ్యప్ప గర్భగుడిపై అదేవిధంగా గర్భగుడి చుట్టూ బంగారు రేకులను పెట్టించారు. దీంతో 2000 నుంచి శబరిమల దేవాలయం స్వర్ణదేవాలయంగా మారింది.
Also Read : శబరిమలలో పరశురాముడు నిర్మించిన మెట్లు పంచలోహ మెట్లుగా ఎలా మారాయో తెలుసా ?