Home » నాగచైతన్య ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

నాగచైతన్య ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

by Anji
Ad

అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నాగ చైతన్య. ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్న చైతూ.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర సీమలో నాగార్జున తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సాయి పల్లవి,  చైతూ సరసన నటిస్తుంది.

Advertisement

అంతేకాకుండా ఇటీవల ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు చైతు. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.నాగార్జున నట వారసుడిగా అడుగుపెట్టిన చైతూ తనకంటూ గుర్తింపు ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు చైతూ దాదాపు రూ.154 కోట్ల నికర విలువతో దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నారు. అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఒక్కో సినిమాకు చైతూ రూ.10 నుండి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అంతేకాకుండా బ్రాండ్ ఎండార్సర్ గా భారీగానే వసూలు చేస్తారు. నివేదికల ప్రకారం ఒక్కో ఎండార్స్ మెంట్ కు రెండు కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

నాగ చైతన్య నటనతో పాటు తన సొంత క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షో ను ప్రారంభించడం ద్వారా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అభివృద్ధి చెందుతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశించి హైదరాబాద్ ఆహార ప్రియులకు పాన్ ఆసియన్ వంటకాలను అందిస్తూ వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యాడు. ఇవే కాకుండా.. జూబ్లీహిల్స్ పరిసరాల్లో తన తండ్రి ఇంటికి సమీపంలో ఒక విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేశాడు. అలాగే చైతూకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు అతని వద్ద దాదాపు రూ.1.75 కో విలువైన ఫెరారీ ఎఫ్ 430, రూ. 3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఉన్నాయి. అలాగే రూ.19 లక్షల BMW R9T, సుమారు రూ.13 లక్షల ఖరీదు చేసే ట్రయంఫ్ థ్రక్స్ టన్ R వంటి సూపర్ బైక్ లను కలిగి ఉన్నాడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading