బాహుబలి సినిమా తరువాత భారతదేశంలో దక్షిణాదికి పెద్ద హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నారు. అందుకు దర్శకులు, నిర్మాతలు కూడా అంగీకరించి భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి పొన్నియిన్ సెల్వన్ని తెరకెక్కించాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయింది.
ఈ చిత్రంలో బాలీవుడు బ్యూటీ ఐశ్వర్యరాయ్, త్రిష, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలోని నటీనటుల విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫస్ట్ డే రోజు ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి రికార్డును సృష్టించింది. ఇటీవల విడుదలైన విక్రమ్, వాలిమై చిత్రాలను వెనక్కి నెట్టింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.39 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది.
Advertisement
Advertisement
Also Read : దీపికా,రణవీర్ విడాకులు తీసుకోబోతున్నారా..?
ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే ఒక్కరోజే ఏకంగా రూ.23.50 కోట్లు వసూలు చేయడం విశేషం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.5.50 కోట్లు, కర్నాటకలో రూ.4కోట్లు, కేరళలో రూ.3.25 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.2.75 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు రూ.39 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక వీకెండ్ రోజుల్లో ఈ చిత్రం మరిన్ని కలెక్షన్లు వసూలు చేయనున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read : బాహుబలి కోసం “పొన్నియన్ సెల్వన్” నుండి జక్కన్న ఆ సీన్లను కాపీ కొట్టాడా..? అలా ఎలా జరిగిందబ్బా..?