ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈమె సినిమాల ద్వారాచ పెద్దగా పాపులారిటీ దక్కించుకోకపోయినా ప్రముఖ నటుడు నరేష్ తో డేటింగ్ విషయంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా నరేష్ అనగానే పవిత్ర లోకేష్.. పవిత్ర లోకేష్ అనగానే నరేష్ .. వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు గుర్తుకు రావడం సహజమై పోయింది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పవిత్ర లోకేష్ అక్కడ సక్సెస్ కాలేక.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.. ఇక ఆ తర్వాత అవకాశాలు తలుపు తట్టాయి. అలా వరుసగా అవకాశాలు అందుకుంటూ అటు కన్నడ, ఇటు తెలుగులో అవకాశాలు అందుకుంటూ కెరియర్ ను బాగా సెట్ చేసుకుంది.
Advertisement
ఇకపోతే గతంలో ఒక దర్శకుడిని వివాహం చేసుకున్న ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత అతనితో కొన్ని మనస్పర్థాలు రావడంతో విడిపోయారు. ఇక ఆ తర్వాత ఈమె నరేష్ కి దగ్గర అయింది. ఇకపోతే నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ఏదో సంబంధం ఉందంటూ వాళ్ళిద్దరూ హోటల్ రూమ్ లో ఉండగా.. నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి మీడియా వారిని తీసుకెళ్లి మరీ గొడవ చేయడం వంటి విషయాలు అందరికీ తెలిసిందే. ఇక దీంతో పవిత్ర లోకేష్ బాగా పాపులర్ అయింది. పెళ్లి వార్తలు వైరల్ అవ్వడమే కాదు.. ఆ వార్తలకు తగ్గట్టుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నామంటూ ధైర్యంగా మీడియా ముందు ప్రకటించారు.
ఇక పెళ్లి కూడా చేసుకుంటున్నామని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ విషయంపై క్లారిటీ రాలేదు. దాంతో గత కొంతకాలంగా పవిత్ర లోకేష్, నరేష్ విషయాన్ని అందరూ పక్కన పెట్టేశారు. ఇకపోతే సినిమాలలో స్క్రీన్ మీద వీళ్ళిద్దరి కాంబినేషన్ కనిపిస్తే చాలు అందరూ తెగ విజిల్స్ వేస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా భారీగానే సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోజువారీ సంపాదన విషయానికి వస్తే రూ.50 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం.. ఎప్పుడైతే నరేష్ తో పాపులారిటీ దక్కించుకుందో అప్పటినుంచి రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని.. ఇక ఒక రోజుకి షెడ్యూల్ ఇస్తే దాని నిమిత్తం లక్ష రూపాయలు తీసుకుంటుందని సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే హీరోయిన్ రేంజ్ లో పవిత్ర లోకేష్ కి పాపులారిటీ లభించింది అని చెప్పడంలో సందేహం లేదు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!