Popular Telugu Anchors: సాధారణంగా పలు ఛానల్స్ ప్రారంభమైన కొత్తలో కాన్సెప్ట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చాలా వచ్చేవి. అందులో ఎందుకో ఏమో గాని చాలా మంది ఫిమేల్ యాంకర్స్ ఎక్కువగా వచ్చేవారు. యాంకిరింగ్ అంటే ఆడవాల్లే చేయాలనే అంతలా ముద్రపడిపోయింది. కొందరూ మేల్ యాంకర్స్ ఈ మధ్య టెలివిజన్ ని ఒక ఊపు ఊపుతున్నారు. వాళ్ల టైమింగ్, వారి ప్రెజెంటేషన్, వారి సెన్స్ ఆఫ్ హ్యుమర్ వాళ్లకే సొంతం అనే చెప్పాలి. తెలుగు మేల్ యాంకర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యాంకర్ ప్రదీప్ :
Advertisement
యాంకర్ ప్రదీప్ మాచిరాజు అక్టోబర్ 23, 1985లో జన్మించాడు. హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఎంబీఏ చదవాలనుకున్నాడు. ఫస్ట్ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పని చేశాడు. ఆ తరువాత రేడియో జాకీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అక్కడ అతని గాత్రం మంచి పేరు తీసుకురావడంతో అక్కడి నుంచి ఫేమస్ అయ్యాడు యాంకర్ ప్రదీప్. మేల్ యాంకరింగ్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించాడు. ప్రదీప్ మేల్ యాంకర్స్ లలో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రదీప్ ఒక్క షోకి యాంకరింగ్ చేస్తే దాదాపు లక్షకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
యాంకర్ రవి :
Advertisement
యాంకర్ రవి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. యాంకర్ రవి 1987లో జన్మించారు. బీటెక్ పూర్తి చేశారు. లవ్ జంక్షన్ అనే షోతో యాంకర్ గా అడుగుపెట్టారు. ఇది మా ప్రేమ కథ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. యాంకరింగ్ చేయడం కంటే ముందు రవికి ఇష్టమైన ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ అంటే చాలా ఇష్టమట. ఇతను ఒక ఎపిసోడ్ కి రూ.1లక్ష రెమ్యునరేషన్ తీసుకుంటాడట. నాలుగు, ఐదు ఛానెల్స్ లలో యాంకరింగ్ చేస్తూ.. అడపదడపా సినిమాల ఆడియో ఫంక్షన్లు తదితర కలిపి యాంకర్ రవి నెలకు రూ.20 నుంచి 30 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.
లోబో :
తెలంగాణ యాసలో కొంచెం హిందీ, కొంచెం ఉర్దూ కలిపి హైదరాబాద్ ప్లేవర్ ఇస్తే అదే లోబో యాస. మా మ్యూజిక్ హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ అనే షోలో వెరైటీ గెటప్ తో ఎప్పుడు వినని యాసతో తనదైన స్టైల్ లో బోలెడెంత ఎంటర్టైన్ మెంట్ ని ఇస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా టాటూ డిజైనర్ గా, వీజేగా, ఆర్జేగా, యాంకర్ గా తన మల్టీ టాలెంట్ తో ఆకట్టుకుంటాడు లోబో. అభిమానులను సంపాదించుకున్నట్టుగానే తాను రెమ్యునరేషన్ కూడా అదేవిధంగా తీసుకుంటున్నట్టు సమాచారం. రూ.50వేల నుంచి రూ.1లక్ష లోపు యాంకరింగ్ చేసిన విధానాన్ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అయితే ఈ మధ్యకాలంలో చాలా తక్కువగానే కనిపిస్తుండడం గమనార్హం.
ప్రభాకర్ :
నటుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ ఈటీవీలో ప్రసారమైన యాహూ అనే ప్రోగ్రామ్ తో యాంకర్ గా మారాడు. ఆ ప్రోగ్రామ్ ఆయనికి ఎంతలా ఫేమస్ చేసిందంటే.. ప్రభాకర్ కాస్త ఈటీవీ ప్రభాకర్ యాహూ ప్రభాకర్ అయిపోయాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు అడపదడపా యాంకరింగ్ చేస్తుంటాడు ప్రభాకర్. ఇతను రూ.75వేల నుంచి రూ.1లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు సమాచారం.