Home » తిరుమలలో ఒకరోజు అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

తిరుమలలో ఒకరోజు అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

by Bunty
Ad

తిరుమల శ్రీవారి గుడి గురించి…. తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే… మొదటగా అందరూ చెప్పే మాట తిరుమల శ్రీవారి పేరు మాత్రమే. పురాతన కాలపత్ర గ్రంధాల ప్రకారం… తిరుమల శ్రీవారు… తిరుమల కొండపై వెలిశారు. దాదాపు 2000 సంవత్సరాల నుంచి తిరుమల దేవాలయం ప్రాముఖ్యత ఉందట. భక్తులు కోరిన మొక్కులు తీర్చే తిరుమల శ్రీవారిగా వెంకటేశ్వర స్వామికి మంచి పేరు ఉంది.

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు.. కచ్చితంగా ఏడాదికి ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే ప్రతిరోజు 60000 నుంచి 90000 వరకు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అటు ప్రతిరోజు నాలుగు కోట్లకు పైగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా వస్తుంది.అందుకే తిరుమల శ్రీవారిని ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన దేవుడిగా పిలుస్తారు. అయితే తిరుమల శ్రీవారి కొండపై ప్రతిరోజు అన్నదానం చేస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు 60 వేల నుంచి 70 వేల మంది వరకు అన్నదానసన్నిధిలో భోజనం చేస్తారు. ఈ భోజనం చాలా కాస్ట్లీ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఇంతమందికి భోజనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే తాజాగా టీటీడీ సమాచారం ప్రకారం ఒకరోజు అన్నదానం చేయాలనుకుంటే 33 లక్షలు ఖర్చు చేసేవారట. ఇక కరోనా సమయం తర్వాత భక్తులు విపరీతంగా పెరిగారట. దీంతో అన్నదానానికి ప్రతిరోజు 38 లక్షల వరకు టీటీడీ ఖర్చు చేస్తోందని సమాచారం అందుతోంది. అలాగే తిరుమల శ్రీవారికి డబ్బుల కొదువా అసలు ఉండదని… ఎంతమంది భక్తులు వచ్చినా భోజనం పెట్టే కెపాసిటీ ఆ భగవంతుడికి ఉందని చెబుతారు అక్కడి భక్తులు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading