Home » టాలీవుడ్ హీరోల్లో ఎవరెన్ని సార్లు ఇండస్ట్రీ హిట్ సాధించారో మీకు తెలుసా ?

టాలీవుడ్ హీరోల్లో ఎవరెన్ని సార్లు ఇండస్ట్రీ హిట్ సాధించారో మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రతీ హీరో కూడా తమ సినిమాలు హిట్ సాధించాలని కోరుకుంటారు. ఆ హీరో సినిమా హిట్ సాధిస్తే అతనే నెంబర్ వన్ హీరో అని టాక్ వినిపిస్తుంటుంది. ఇక  ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ చైర్ కోసం పోటీ పడుతున్నా హీరోల్లో ఎవరు ఎన్నిసార్లు ఇండస్ట్రీ హిట్ సాధించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

 

పవన్ కళ్యాణ్ :

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరిలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే చెబుతుంటారు ఎవరైనా. ఎక్కువ క్రేజ్.. అలాగే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా. పవన్ చేసిన ప్రతీ సినిమా దాదాపు మంచి విజయాన్ని సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది. అదేవిధంగా అత్తారింటికి దారేది సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ సాధించింది. పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 

మహేష్ బాబు :

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది. అప్పటివరకు చిరంజీవి నటించిన ఇంద్ర పేరు మీద ఉన్న రికార్డులు మొత్తాన్ని బ్రేక్ చేస్తూ ఈ మూవీ విజయం సాధించింది. దూకుడు కొంత పర్వాలేదనిపించినప్పటికీ అప్పటి వరకు ఉన్న మగధీర రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. శ్రీమంతుడు మూవీ మాత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మొత్తానికి మహేష్ బాబు ఇప్పటిరవరకు రెండుసార్లు ఇండస్ట్రీ హిట్ సాధించాడు.

రామ్ చరణ్ :

Advertisement

 

మెగాపవర్ రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మగధీరతో పాటు రామ్ చరణ్ తన కెరీర్ లో రంగస్థలం వంటి సూపర్ హిట్ మూవీతో మరోసారి ఇండస్ట్రీ హిట్ సాధించాడు. RRR మూవీతో రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటివరకు మూడు సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 

ప్రభాస్ :

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం మూవీతో సూపర్ హిట్ సాధించాడు. ఇక ఆ తరువాత కొన్ని ఫ్లాప్స్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి మూవీతో మంచి హిట్ పడింది. ఇక ఆ తరువాత ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ బాహుబలి మూవీతో రెండుసార్లు ఇండస్ట్రీ హిట్ సాధించాడు. ప్రభాస్ చేసిన రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ సాధించాయి. 

 అల్లు అర్జున్ :

allu-arjun-in-ads

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురం మూవీ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో బన్నీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ కూడా సూపర్ హిట్ అయినప్పటికీ ఇండస్ట్రీ హిట్ సాధించలేకపోయింది. 

ఎన్టీఆర్ :

ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని నుంచి ఆర్ఆర్ఆర్ వరకు చాలా సినిమాలు తీశఆడు. అందులో చాలా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సింహాద్రి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. RRR మినహా ఇప్పటివరకు ఎన్టీఆర్ కి ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ లేకపోవడం గమనార్హం.

టాలీవుడ్ హీరోల్లో ఎవరెన్ని ఇండస్ట్రీ హిట్ సాధించారో మీకు తెలుసా ? 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

విజయ్-వెంకట్ ప్రభు మూవీలో ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!

Venu Swamy : త్వరలోనే ఆది, నిక్కి గల్రానీ విడాకులు.. వేణు స్వామి సంచలనం

 

Visitors Are Also Reading