Home » ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.?

ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.?

by Anji
Ad

ఆధార్డ్‌ కార్డ్‌ అన్ని రకాల పనులకు  ఇప్పుడు అని వార్యంగా మారింది. సిమ్‌ కార్డు మొదలు విమాన టికెట్‌ వరకు అన్నింటికీ ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. దీంతో ఎటు వెళ్లినా జేబులో ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అడ్రస్‌ మారినా, ఇంటి పేరు మార్చుకోవాలనుకున్నా, ఫోన్‌ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోవాలనుకున్నా ఆధార్‌ అప్‌డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఆధార్‌ కార్డులో ఏ వివరాలను ఎన్ని సార్లు మార్చుకునే అవకాశం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ ఆధార్‌ అప్‌డేట్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఇప్పుడు  మనం తెలుసుకుందాం.

Advertisement

ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడం కుదరదు. కేవలం ఒక్కసారి మాత్రమే పుట్టిన తేదీ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరైన కారణం ఉంటే మినహాయింపు ఇస్తారు. ఒకవేళ రెండోసారి పుట్టిన తేదీని మార్చాల్సి వస్తే.. యూఐడీఏఐ జాబితా ప్రకారం చెల్లుబాటు అయ్యే రుజువుతో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్న ఆధార్‌ సెంటర్‌ లేదా 1947 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలి.

Advertisement

ఆధార్‌ కార్డులో ఫొటోను ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న ఆధార్‌ ఎన్‌రోల్‌ సెంటర్‌కు వెళ్లి మీ ఫొటో, వేలి ముద్రలు వంటి వాటి ఆధారంగా ఫొటోలను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు ఉంది.

ఇక ఆధార్‌ కార్డులో అడ్రస్‌ను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అడ్రస్‌ మార్పునకు ఎలాంటి పరిమితి లేదు. ఆధార్‌ సెంటర్‌లో సంబంధించిన డాక్యుమెంట్స్‌ని అందించడం ద్వారా ఆధార్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు.

ఆధార్‌ కార్డులో జెండర్‌ను ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం, అవసరమైన డాక్యుమెంట్స్‌ను అందించడం ద్వారా జెండర్‌ అప్‌డేట్‌ను మరోసారి అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి సాధారణంగా.. పాస్‌పోర్ట్, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ, రెగ్యులేటరీ బోర్డు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడం ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, టెన్త్ సర్టిఫికెట్‌, టాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌ వంటి సర్టిఫికెట్స్‌ అవసరపడతాయి.

Visitors Are Also Reading