ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. రోజులో కొన్నిగంటల పాటు ఫోన్లలోనే మునిగిపోతుంటారు. మరికొందరైతే రెండు, మూడు ఫోన్లను కూడా మెయింటెన్ చేస్తుంటారు. అయితే మరీ టెక్ దిగ్గజం అయిన గూగ్ల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా ?. రెండు కాదు మూడు కాదు ఏకంగా 20 స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరి సుందర్ పించాయ్ ఇన్ని ఫోన్లను ఎందుకు వాడుతున్నారనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.
Advertisement
అయితే సుందర్ పిచాయ్ 20 స్మార్ట్ఫోన్లను ఎందుకు వాడతారంటే.. ఆయా డివైజ్‌లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును టెస్ట్ చేస్తుంటారు. ఇందుకోసం మార్కెట్లోకి వచ్చిన 20 స్మార్ట్ మొబైల్స్‌ను కొనుగోలు చేసి.. ఆయా ఫోన్లలో గూగుల్ యాప్స్, వాటి ఉత్పత్తులు ఎలా పనిచేస్తున్నాయి ? ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. తరచుగా పాస్వర్డ్లు మార్చడంతో గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుందని.. అందుకోసమే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడటం సురక్షితమైందని సుందర్ పిచాయ్ అన్నారు.
Advertisement
ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో యూజర్లు తమను తాము రక్షించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ నిద్రలేవగానే ఉదయం ‘టెక్ మీమ్’ అనే వెబ్‌సైట్‌ను చూస్తానని పేర్కొన్నారు. అందులో వచ్చేటటువంటి అప్డేట్స్ను క్రమం తప్పకుండా చదువుతానని.. టెక్ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి వెబ్సైట్ అని చెప్పారు. ప్రస్తుతం వెబ్ సెర్చింగ్ విధానం అనేది రోజురోజుకు మారుతూ వస్తుందని.. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని మరింద మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే జెమిని ఏఐ చాట్‌బాట్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..? సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది..?