Home » బిగ్ బాస్ శివాజీ ఎంత మందికి డబ్బింగ్ చెప్పారో తెలుసా ?

బిగ్ బాస్ శివాజీ ఎంత మందికి డబ్బింగ్ చెప్పారో తెలుసా ?

by Anji
Ad

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి మెప్పించారు శివాజీ. చాలా సినిమాల్లో నటించి మెప్పించారు శివాజీ. ఆతర్వాత శివాజీ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. శివాజీ మాస్టర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎదుగు పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో ఆయన స్టూడెంట్ గా కనిపించాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. శివాజీ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన నటనతోనే కాదు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పిచారు శివాజీ. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. రాజకీయాల పై ఆసక్తితో కొంతకాలం పాలిటిక్స్ వైపు అడుగేశారు. ఆతర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక శివాజీ బిగ్ బాస్ సీజన్ 7తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు.

Advertisement

Advertisement

బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శివాజీ. బిగ్ బాస్ సీజన్ 7 లో ఫైనలిస్ట్ గా నిలిచాడు శివాజీ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలవడంతో మరోసారి శివాజీ పేరు మారుమ్రోగింది. అయితే కేవలం నటుడిగానే కాదు.. శివాజీ పలువురు హీరోలకు తన వాయిస్ ఇచ్చారన్న విషయం తెలిసిందే.  శివాజీ జయం సినిమాలో నితిన్ కు డబ్బింగ్ చెప్పారు. అలాగే సొంతం సినిమాలో ఆర్యన్ రాజేష్ కు డబ్బింగ్ చెప్పారు. అలాగే దిల్, సంబరం సినిమాలో నితిన్ కు, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో యశో సాగర్ కు, అలాగే పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పారు శివాజీ. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తో తిరిగి ప్రేక్షకులను అలరించిన శివాజీ మరిన్ని సినిమాల్లో నటిస్తారేమో చూడాలి.

Also Read : హీరోయిన్ నయనతారను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందా ?

Visitors Are Also Reading