తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ ఎఫెక్ట్ పడింది. తాజాగా లియో సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. లియో మూవీ విడుదలపై కోర్టు స్టే విధించంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్టోబర్ 19న రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఇలా జరగడం ఏంటని విజయ్ తెలుగు ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు.
Advertisement
ఇక ఇప్పటికే టిక్కెట్‌లు బుక్ చేసుకున్న ఆడియెన్స్ సైతం కాస్త టెన్షన్ పడ్డారు. రీసెంట్‌గా ఈ విషయంపై నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా కచ్చితంగా అనుకున్న తేదీకే విడుదల అవుతుందని చెప్పాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తెలుగులో ‘లియో’ టైటిల్‌ను ఒకరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఆ వ్యక్తితో చర్చలు జరిపి సమస్యకు ముగింపు పలికాడు. కాగా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వారికి నాగవంశీ రూ.26.5 లక్షలు ముట్టజెప్పి వివాదాన్ని ముగించినట్టు సమాచారం.
Advertisement
ఇక లియో బుకింగ్స్ తెలుగులోనూ అదరగొడుతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కినట్లు ప్రచారం జరగడంతో టిక్కెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగులో నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు. దాదాపు రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగనున్న ఈ సినిమా తొలిరోజే అందులో సగం కలెక్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. తెలుగులో విజయ్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమగా ఇది పక్కా నిలుస్తుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రోజాకు ఇష్టమైన వంటకాలు ఇవే..మాంసం లేనిదే ముద్ద దిగదు ?
రవితేజ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా ?