Home » రణబీర్ కపూర్ ఎన్ని కోట్లకు అధిపతో మీకు తెలుసా ?

రణబీర్ కపూర్ ఎన్ని కోట్లకు అధిపతో మీకు తెలుసా ?

by Anji
Ad

ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 01 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ  నేపథ్యంలోనే రణబీర్ కపూర్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆయన అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్, ఆ లగ్జరీ లైఫ్ అనుభవించడానికి దాని వెనుక ఉన్న ఆయన ఆస్తి అన్ని కూడా మరింత వైరల్ గా మారుతుండటం గమనార్హం. ఇకపోతే రణబీర్ కపూర్ ఆస్తుల వివరాలు ఇప్పుడు మనం  తెలుసుకుందాం.


రణబీర్ కపూర్ కి మూడు ఖరీదైన ఇల్లు ఉండగా.. అందులో మొదటిది, బాంద్రాలోని వాస్తు పాలి హిల్ బిల్డింగ్ లో 5, 7వ అంతస్తులో 2460 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఇల్లు ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి రూ.35 కోట్లు అయితే ఏడవ అంతస్తులో తాను నివాసం ఉండగా.. ఐదవ అంతస్తును రూ.8 లక్షలకు అద్దెకు ఇచ్చారు. అంతే కాదు రూ.500 కోట్ల విలువ గల కృష్ణ రాజ్ బంగ్లా కి కూడా ఈయన వారసుడు. ఇది 15 అంతస్తుల అపార్ట్ మెంట్. ఇక రణబీర్ కపూర్ కార్ గ్యారేజ్ లో ఉన్న కార్ల విషయానికొస్తే.. ఆడి R 8, రూ. 1.6 కోట్ల విలువైన వైట్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రూ.87 లక్షల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ.1.56 కోట్ల విలువైన ఆడి A8I, రూ.2.14 కోట్ల విలువ గల మెర్సిడెస్ బెంజ్ G63 AMG వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఈ కార్ల విలువ రూ.7 కోట్ల పైమాటే.

Advertisement

Advertisement


అంతేకాదు పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం పనిచేస్తున్న ఈయన రోజుకు రూ.6 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అలాగే ఇండియన్ సూపర్ లీగ్ ఫుడ్ బాల్ లో ముంబై సిటీ FC అనే స్పోర్ట్స్ టీంని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఒక్కో సినిమాకు రూ.70 కోట్ల వరకు చార్జ్ చేసుకున్నారు. మొత్తం కలుపుకొని 2023 నాటికి రణబీర్ కపూర్ నికర ఆదాయం రూ.600 కోట్లకు చేరింది. అంతేకాదు తల్లిదండ్రుల వారసత్వంగా కూడా ఈయనకు మరింత ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఈయన భార్య ఆలియా కూడా ప్రముఖ స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె కూడా భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading